ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medak : నగల కోసం కన్నవారిని చంపేసి..

ABN, Publish Date - Jun 15 , 2024 | 06:18 AM

మూడు తులాల బంగారం కోసం వృద్ధులైన తల్లిదండ్రులను గొంతు పిసికి చంపాడో వ్యక్తి! మృతదేహాలను ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగులబెట్టి.. కన్నవారు కనిపించడం లేదంటూ స్థానికులకు చెప్పుకొని ఏడ్చాడు!

  • పెట్రోలు పోసి తగులబెట్టిన కుమారుడు

  • 3 తులాల నగలివ్వాలని అడిగినాతల్లి నిరాకరణ

  • గొంతు పిసికి హత్య చేసిన కొడుకు

  • మెదక్‌ జిల్లా లో ఘోరం

హత్నూర/ నర్సాపూర్‌, జూన్‌ 14: మూడు తులాల బంగారం కోసం వృద్ధులైన తల్లిదండ్రులను గొంతు పిసికి చంపాడో వ్యక్తి! మృతదేహాలను ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగులబెట్టి.. కన్నవారు కనిపించడం లేదంటూ స్థానికులకు చెప్పుకొని ఏడ్చాడు! మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పరిఽధిలోని ఈ ఘోరం జరిగింది. ఈ మేరకు ఇటీవల వెలుగుచూసిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. మృతులు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లనగర్‌కు చెందిన దంపతులు చాకలి కిష్టయ్య (80), నర్సమ్మ (70). ఘటన తాలూకు వివరాలను పోలీసులు వెల్లడించకపోయినా కన్నకొడుకే వృద్ధ దంపతులను హత్యచేసినట్లు సమాచారం. కిష్టయ్య-నర్సమ్మ దంపతులకు నలుగురు సంతానంలో లక్ష్మణ్‌ ఆఖరివాడు.

గుమ్మడిదల మండలం దోమడుగులో అద్దె ఇంట్లో ఉంటూ దగ్గర్లోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మే 13న ఎన్నికల పోలింగ్‌ కోసం ఓటు వేసేందుకు సొంతూరొచ్చాడు. ఆ మర్నాడు తల్లిదండ్రులను తన కారులో ఎక్కించుకొని దోమడుగు వెళ్లినట్లు గ్రామస్థుల ద్వారా తెలిసింది. అప్పటి నుంచి ఆ వృద్ధ దంపతులు మళ్లీ కనిపించలేదు. వాస్తవానికి లక్ష్మణ్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో తల్లి నర్సమ్మను మెడలో ఉన్న మూడు తులాల బంగారు నగలు ఇవ్వాలని అడిగాడు.

ఇందుకు ఆమె నిరాకరించింది. ఆ ఆభరణాలను ఎలాగైనా తీసుకోవాలని లక్ష్మణ్‌ పథకం వేసినట్లు తెలిసింది. తల్లిదండ్రులను తాను ఉంటున్న అద్దె ఇంట్లోనే గొంతు నులిమి చంపి, నర్సాపూర్‌ సమీపంలోని అడవిలోకి మృతదేహాలను తీసుకొచ్చినట్లు సమాచారం. అక్కడ మృతదేహాలపై పెట్రోల్‌పోసి తగలపెట్టినట్లు చెబుతున్నారు. మూడు రోజుల తర్వాత మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మరోవైపు లక్ష్మణ్‌ కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులు కనిపించడం లేదంటూ చెబుతుండటంతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, జరిగిన విషయాన్ని అంగీకరించినట్లు సమాచారం.

Updated Date - Jun 15 , 2024 | 06:18 AM

Advertising
Advertising