Fake Call malware: ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. తీవ్ర ఆందోళన కలిగిస్తు్న్న కొత్త మాల్‌వేర్
ABN, Publish Date - Nov 04 , 2024 | 07:47 PM
సైబర్ మోసగాళ్లు ఏదో ఒక మార్గంలో అమాయక జనాలను ముంచాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేటుగాళ్లు తాజాగా మరో కొత్త మాల్‌వేర్‌ను సృష్టించి జనాల మీదకు వదిలారు. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ మాల్‌వేర్ పేరు ‘ఫేక్ కాల్ మాల్వేర్’. లక్షలాది మంది ఆండ్రాయిడ్ యూజర్లకు దీని ముప్పు పొంచివుంది. స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశించి బ్యాంకింగ్ సమాచారాన్ని తస్కరిస్తున్న ఈ మాల్‌వేర్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ రోజుల్లో ఎంత కాస్ట్లీ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తున్నా భద్రత మాత్రం ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం, పేమెంట్ యాప్‌ల డేటా, బ్యాంక్ ఖాతాలోకి డబ్బులకు గ్యారంటీ లేకుండా పోతోంది. సైబర్ మోసగాళ్లు ఏదో ఒక మార్గంలో అమాయక జనాలను ముంచాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేటుగాళ్లు తాజాగా మరో కొత్త మాల్‌వేర్‌ను సృష్టించి జనాల మీదకు వదిలారు. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ మాల్‌వేర్ పేరు ‘ఫేక్ కాల్ మాల్వేర్’. లక్షలాది మంది ఆండ్రాయిడ్ యూజర్లకు దీని ముప్పు పొంచివుంది. స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశించి బ్యాంకింగ్ సమాచారాన్ని తస్కరిస్తున్న ఈ మాల్‌వేర్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఫేక్‌కాల్ మాల్‌వేర్ తొలుత స్మార్ట్‌ఫోన్లలోకి ప్రవేశించి బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించి.. ఆ సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేసేలా దీనిని తయారు చేశారు. ఇది ఎంత డేంజరస్ అంటే ఫోన్‌లకు వచ్చే బ్యాంకింగ్ సంబంధిత ఇన్‌కమింగ్ కాల్స్‌ను కూడా హైజాక్ చేయగలుగుతుంది. దీంతో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ మాల్‌వేర్‌తో పెను ప్రమాదం ఏర్పడింది.
ఈ మాల్‌వేర్‌ను 2022లో కాస్పర్‌స్కై (Kaspersky) మొదటిసారి గుర్తించింది. అయితే ఇప్పుడు మొబైళ్లలోకి చొరబడుతున్న ఈ ‘ఫేక్ కాల్ మాల్‌వేర్’ లేటెస్ట్ వెర్షన్ అని, మరింత ముప్పుగా పరిణమించిందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్‌గ్రేడ్ చేసిన ఈ వెర్షన్ మాల్‌వేర్‌తో ఎక్కడో దూరాన ఉండి కూడా స్మార్ట్‌ఫోన్‌లను హ్యాకర్లు కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు.
సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపేరియం (Zimperium) ఈ కొత్త మాల్‌వేర్‌పై హెచ్చరిక జారీ చేసింది. విషింగ్ (Vishing) లేదా వాయిస్ ఫిషింగ్ అనే సాంకేతికతను ఉపయోగించి దీనిని తయారు చేశారని తెలిపింది.
మొబైల్స్‌లోకి ఎలా ప్రవేశిస్తుంది?
మోసరిపూరిత బ్యాంకింగ్ కాల్స్ లేదా వాయిస్ సందేశాల ద్వారా యూజర్లను టార్గెట్ చేసి ఈ మాల్‌వేర్‌ను పంపిస్తారు. హ్యాకర్లు ఈ మాల్‌వేర్‌ని ఏపీకే ఫైల్స్ (APK Files) రూపంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు పంపిస్తుంటారు. ఏపీకే ఫైల్ మాదిరిగా ఉన్న యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ‘ఫేక్ కాల్ మాల్‌వేర్’ డిఫాల్ట్ డయలర్‌గా మారిపోతుంది. ఆ సమయంలో కొన్ని పర్మిషన్లను అడుగుతుంది. చాలా మంది యూజర్లు అవగాహన లేకుండానే పర్మిషన్లు ఇస్తుంటారు. ఒకవేళ అనుమతి ఇస్తే ఫోన్‌కు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్ రెండింటికి సంబంధించిన సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
ఇక మాల్‌వేర్‌ను యూజర్లు గుర్తించకుండా ఉంచేందుకు లీగల్ యాప్ మాదిరిగా కనిపించేలా రూపొందించారు. ఇది ఫేక్ యూఐని కూడా ఉపయోగించుకుంటుంది. అంతేకాదు యూజర్లకు కంటపడకుండా థర్డ్ పార్టీ యాప్‌లలో దాక్కుంటుంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్ మినహాయి సందేహాస్పదంగా ఉన్న ఎలాంటి ప్లాట్‌ఫామ్ నుంచి కూడా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. అలా చేస్తే ఎవరి ఫోన్లను వారి ప్రమాదంలోకి నెట్టినట్టే.
మరి ప్రొటెక్షన్ ఎలా?
ప్రమాదకరమైన ఈ ఫేక్ మాల్‌వేర్ బారిన పడకుండా ఉండేందుకు గూగుల్ ప్లే స్టోర్ మినహా ఇతర ప్లాట్ ఫామ్‌ల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లు లేదా వెబ్‌సైట్‌లు, ఏపీకే ఫైల్ ఇన్‌స్టాలేషన్‌లకు దూరంగా ఉండాలి. ఇక యాప్‌లకు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర అనుమతులు.. అంటే మీ ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ వంటి యాక్సెస్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇవి కూడా చదవండి
డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం
IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవేనా..
ఇవాళ ఒక్క రోజే రూ.7.37 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు.. కారణాలు ఇవే
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
For more Sports News And Telugu News
Updated Date - Nov 04 , 2024 | 07:48 PM