ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pixel Laptop: త్వరలో పిక్సెల్ లాప్‌టాప్ లాంచ్ చేయనున్న గూగుల్?

ABN, Publish Date - Nov 19 , 2024 | 06:28 PM

గూగుల్ త్వరలో పిక్సెల్ బ్రాండ్‌ పేరిట ఓ లాప్‌టాప్ లాంఛ్ చేయనుందన్న వార్త ప్రస్తుతం టెక్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్స్ వినియోగదారుల మన్ననలు పొందిన నేపథ్యంలో గూగుల్.. లాప్‌టాప్‌పై కూడా దృష్టి సారించినట్టు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ త్వరలో పిక్సెల్ బ్రాండ్‌ పేరిట ఓ లాప్‌టాప్ లాంఛ్ చేయనుందన్న వార్త ప్రస్తుతం టెక్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్స్ వినియోగదారుల మన్ననలు పొందిన నేపథ్యంలో గూగుల్.. లాప్‌టాప్‌పై కూడా దృష్టి సారించినట్టు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అత్యద్భుత పర్ఫార్మెన్స్ అందించే హార్డ్‌వేర్, సరళమైన డిజైన్ ఉండేలా ఈ లాప్‌టాప్ ఉండొచ్చని అంచనా. ఈ లాప్‌టాప్‌కు స్నోయీ అనే కోడ్ నేమ్ కూడా పెట్టినట్టు ఆండ్రాయిడ్ హెడ్‌లైన్ అనే వార్త సంస్థ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి తమకు ఈమెయిల్స్ లభించాయని కూడా పేర్కొంది. మ్యాక్‌బుక్ ప్రో, డెల్ ఎక్స్‌పీఎస్, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ లాప్‌టాప్, సామ్‌సంగ్ గ్యాలెక్సీ క్రోమ్‌బుక్‌తో పోటీపడేలా దీన్ని సిద్ధం చేస్తున్నారట (Technology).

WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..


అత్యాధునిక టెక్నాలజీ జోడించి సరళమైన మినిమలిస్టిక్ డిజైన్‌లో ఈ లాప్‌టాప్ రూపొందించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకున్నదట. అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న హై రిజల్యూషన్ డిస్‌ప్లే‌తో అటు ఎంటర్‌టైన్మెంట్‌కు ఇటు పనులకు అనువుగా ఉండేలా దీని డిజైన్ ఉండబోతోందని సమాచారం. గూగుల్ స్వయంగా అభివృద్ధి చేసుకున్న టెన్సార్ చిప్ సాంకేతికతను కూడా ఇందులో వినియోగించే అవకాశం ఉందట. ఇప్పటికే ఈ టెక్నాలజీ గూగుల్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఐ ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్లు, రియల్ టైం ట్రాన్స్‌స్క్రిప్షన్, అత్యాదునిక సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న గూగుల్ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు, డివైజ్‌లతో సులువుగా అనుసంధానమయ్యేలా ఈ లాప్‌టాప్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

New AI Tool: అబద్ధాలొద్దు, నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లారు.. కొత్త ఏఐ టూల్ షాకింగ్ ఫాక్ట్స్


ఇతర ఉత్పత్తుల నుంచి వినియోగదారులను తమవైపు తిప్పుకునే దిశగా ఈ లాప్‌టాప్‌లో గూగుల్ వర్క్‌ స్పేస్, క్రోమ్ ఓఎస్, లాప్‌టాప్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాండ్రాయిడ్ ఓఎస్ కూడా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ విషయాలపై గూగుల్ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. అయితే, గూగుల్ సాధారణంగా కొత్త సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ ఉత్పత్తులను ఏడాది చివర్లోనో లేదా మరుసటి ఏడాది మొదట్లోనో వినియోగదారులకు ముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించేలా పిక్సెల్ లాప్‌టాప్‌లు ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది మొదట్లో కానీ వినియోగదారుల ముందుకు రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

For More Technology News and Telugu News

Updated Date - Nov 19 , 2024 | 06:33 PM