ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WhatsApp: వాట్సాప్ నుంచి మరో క్రేజీ అప్డేట్..త్వరలోనే వెబ్ డార్క్ మోడ్ ఫీచర్

ABN, Publish Date - Jan 02 , 2024 | 03:26 PM

మెటా యాజమాన్యంలోని వాట్సాప్(WhatsApp Web) వెబ్ నుంచి మరొక ఫీచర్ రాబోతుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశపెట్టిన డార్క్ మోడ్ ఫీచర్ ఇకపై మరికొన్ని రోజుల్లో వెబ్‌లో కూడా అమల్లోకి రానుంది.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp Web) వెబ్ నుంచి త్వరలో మరికొన్ని ఫీచర్లు రానున్నాయి. చాలా కాలంగా అమలు చేయాలని చూస్తున్న వెబ్ డార్క్ మోడ్(Dark mode)ను ఇప్పుడు వెబ్ వర్షన్‌లో కూడా అమలు చేయనున్నారు. అందుకోసం ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో మొదట ఈ వర్షన్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో డిసెంబర్ నెలలో టెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ క్రమంలో అనేక మంది ఈ వెర్షన్ కోసం సానుకూలంగా స్పందించగా..ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో దీనిని మరింత అప్‌గ్రేడ్ చేసి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


అయితే ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లతోపాటు iPadలలో అమల్లో ఉంది. మీరు రాత్రిపూట మీ ల్యాప్‌టాప్, లేదా PCలో WhatsApp వెబ్‌ని ఉపయోగిస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ ఫీచర్‌ను ఇష్టపడతారు. ఎందుకంటే ఇది కళ్లకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. WhatsApp వెబ్ డార్క్‌మోడ్‌ని అధికారికంగా విడుదల చేసిన తర్వాత ఇది అమల్లోకి రానుంది. మీరు మీ బ్రౌజర్‌లో ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్ ఎంపికను ఉపయోగించడం ద్వారా లేదా ఇన్‌స్టాల్ చేయడం ద్వారా దీన్ని పొందవచ్చు.

మీ కంప్యూటర్‌లో WhatsApp వెబ్‌కి వెళ్లి QR కోడ్ ద్వారా లాగిన్ చేయండి. దీన్ని చేయడానికి, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్‌ని తెరిచి, కుడి వైపున ఉన్న మూడు చుక్కల ఎంపికపై నొక్కండి. ఇప్పుడు వాట్సాప్ వెబ్‌పై క్లిక్ చేసి, వెబ్‌సైట్‌లో వచ్చే క్యూఆర్ కోడ్‌ను కంప్యూటర్‌లో స్కాన్ చేయండి. అదేవిధంగా ఐఫోన్ వినియోగదారుల కోసం, మీ ఫోన్‌లో వాట్సాప్‌ను తెరిచి సెట్టింగ్‌లకు వెళ్లండి. వాట్సాప్ వెబ్‌ని ఇక్కడ తెరవండి. ఇప్పుడు మీ కంప్యూటర్ స్క్రీన్‌పై కోడ్‌ని స్కాన్ చేసి లాగిన్ చేయండి. ఆ తర్వాత మీ కంప్యూటర్‌లోని వాట్సాప్ వెబ్ పేజీపై రైట్ క్లిక్ చేసి, ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్‌ని ఎంచుకోండి. ప్రస్తుతం మళ్లీ ఆ లైన్‌పై రైట్ క్లిక్ చేసి వెబ్ డార్క్ లేదా వెబ్‌డార్క్ టెక్ట్‌కు మారవచ్చు.

Updated Date - Jan 02 , 2024 | 03:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising