Mobile Calls: బీ అలర్ట్.. ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి..
ABN, Publish Date - Dec 08 , 2024 | 05:09 PM
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడుతున్నారు. జేబులో డబ్బు లేకున్నా కూడా పర్లేదు కానీ స్మార్ట్‌ఫోన్ మాత్రం కచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సైబర్ మోసగాళ్లు స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు.
Mobile Calls: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడుతున్నారు. జేబులో డబ్బు లేకున్నా కూడా పర్లేదు కానీ స్మార్ట్‌ఫోన్ మాత్రం కచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సైబర్ మోసగాళ్లు స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు. ఫోన్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ స్కామ్‌ల కేసులు ఎక్కువగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మొబైల్ హ్యాకింగ్ చేయడం, ఎస్‌ఎంఎస్ ద్వారా మోసం, డిజిటల్ అరెస్ట్ లాంటి వివిధ పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ వల్ల కలిగే నష్టాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నిర్దిష్ట నంబర్ల నుండి వచ్చే కాల్స్ కు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండాలని వినియోగదారులను హెచ్చరిస్తోంది. ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్ లను టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన చక్షు పోర్టల్‌లో నివేదించాలని సూచించింది.
ఈ కాల్స్ ను ఎత్తకండి:
DoT తన అధికారిక X ఖాతా నుండి పోస్ట్ చేస్తున్నప్పుడు అంతర్జాతీయ కోడ్ గురించిన సమాచారాన్ని షేర్ చేసింది. ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్ ను లిఫ్ట్ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
+77
+89
+85
+86
+84
ఈ నంబర్ నుండి DoT లేదా TRAI ఎప్పుడూ కాల్ చేయదని స్పష్టం చేసింది. ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తే అస్సలు మాట్లాడవద్దని సూచించింది. మీ మొబైల్‌కు వస్తున్న ఫేక్ కాల్స్ ను చక్షు పోర్టల్‌ను రిపోర్ట్ చేయండి. పోర్టల్‌లో ఫేక్ కాల్స్ నంబర్‌ను నివేదించిన తర్వాత, ప్రభుత్వం ఆ నెంబర్ ను బ్లాక్‌లిస్ట్ చేస్తుంది. పైన పేర్కొన్న నంబర్ల నుండి ఎవరికైనా వారి మొబైల్‌కు కాల్స్ వస్తే, వెంటనే దానిని పోర్టల్‌లో రిపోర్ట్ చేయండి.
Updated Date - Dec 08 , 2024 | 05:09 PM