ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BSNL: బీఎస్ఎన్ఎల్‌లో ఈ ప్లాన్‌తో జియో, ఎయిర్‌టెల్‌పై ఒత్తిడి

ABN, Publish Date - Aug 07 , 2024 | 02:45 PM

బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది. మినిమం రూ.500 నుంచి రూ.1000 వరకు పెడితేనేగానీ రీచార్జ్ చేసుకోవడం కష్టంగా మారింది. టారిఫ్ ధరలను పెంచాక అందరీ చూపు బీఎస్ఎన్‌ఎల్‌పై పడింది. కారణం.. అత్యంత చౌకైన రీచార్జ్ ప్లాన్లు ఉండటమే. BSNL అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ ప్రజాదరణ పొందుతోంది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌కు ఉన్నారు. బడ్జెట్ అనుకూలమైన ఎంపికలను కోరుకునే వారికి ఈ టెలికాం కంపెనీ నంబర్ వన్ ఎంపికగా మారింది. కంపెనీ తన వినియోగదారుల అవసరాలను తీర్చడానికి సరసమైన ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

రూ. 107 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్‌లో ముఖ్యమైన ప్లాన్‌లలో రూ. 107 ప్లాన్ ఒకటి. ఇది ఎక్కువ డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర టెలికాం కంపెనీలు ఇదే ధరకు 20 - 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తే.. బీఎస్ఎన్ఎల్ మాత్రం 35 రోజుల పాటు చెల్లుబాటు వ్యవధిని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత ఫోన్ కాల్‌లకు బదులు, వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లకు 200 నిమిషాలపాటు మాట్లాడవచ్చు.


రూ.108 ప్లాన్

రూ.107 ప్లాన్‌లో మొత్తం 3 జీబీ డేటా 35 రోజుల వ్యవధితో వస్తుంది. డేటా ఎక్కువగా కావాలనుకునేవారికి ఈ ప్లాన్ తక్కువ అనుకూలంగా ఉంటుంది. మరింత డేటా అవసరమయ్యే కస్టమర్ల కోసం రోజుకు 1 జీబీ డేటాను రూ. 108 ప్లాన్‌ అందిస్తోంది. దీంతోపాటు 28 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచితంగా కాల్ చేసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు..

ఇతర నెట్‌వర్క్‌లతో పోటీగా నిలిచేందుకు బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా హై స్పీడ్ కనెక్టివిటీని అందించడానికి సిద్ధంగా ఉంది. అదనంగా, ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీగా 5G టెక్నాలజీ కోసం కంపెనీ ట్రయల్స్ ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు 5G రెడీ సిమ్ కార్డ్‌లను కూడా అందిస్తోంది.15 వేలకుపైగా 4G సైట్‌లు ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ క్రింద స్థాపితమైన ఈ సైట్‌లు దేశమంతటా నిరంతరాయ కనెక్టివిటీని అందించడానికి సిద్ధమవుతున్నాయి.

For Latest News and National News click here

Updated Date - Aug 07 , 2024 | 02:45 PM

Advertising
Advertising
<