ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Apple: యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్, iPad వస్తుందోచ్..ఏప్పుడంటే?

ABN, Publish Date - Feb 03 , 2024 | 03:07 PM

Samsung మొదటి ఫోల్డింగ్ ఫోన్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత Xiaomi, Vivo, Oppo, OnePlus వంటి కంపెనీలు ఈ ఫోల్డబుల్ ఫోన్‌లను ఆవిష్కరించాయి. ఈ క్రమంలోనే త్వరలో ప్రముఖ సంస్థ యాపిల్ కూడా ఈ ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఫోల్డబుల్ ఫోన్‌ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్కెట్లో ఇలాంటి మోడల్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొంత మంది కస్టమర్లు ఉంటారు. అయితే ఇప్పటికే Samsung మొదటి ఫోల్డింగ్ ఫోన్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత Xiaomi, Vivo, Oppo, OnePlus వంటి కంపెనీలు ఈ ఫోల్డబుల్ ఫోన్‌లను ఆవిష్కరించాయి. ఈ క్రమంలోనే త్వరలో ప్రముఖ సంస్థ యాపిల్ కూడా ఈ ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bengaluru: 5555 కేజీల నాణేలతో స్వామీజీకి తులాభారం


ఈ నేపథ్యంలో యాపిల్ బ్రాండ్ మడత ఫోన్ లేదా ఐప్యాడ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోల్డబుల్ పరికరాలు 2026లో ప్రారంభమవుతాయని లేదా 2027 చివరలో రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఆ ఫోల్డబుల్ డిస్‌ప్లే పరిమాణం 7 నుంచి 8 అంగుళాల మధ్య ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేశారు. 7.6 అంగుళాల శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5కి ఇది పోటీ ఇవ్వనుందని చెబుతున్నారు.

మరోవైపు ఇప్పటికే పలు కంపెనీలు మడతపెట్టే ల్యాప్‌టాప్‌లను విడుదల చేశాయి. వాటిలో Asus, Lenovo వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ PC Lenovo నుంచి థింక్‌ప్యాడ్ X1. ఇది OLED ల్యాప్‌టాప్ కాగా దీనిని అన్ని రకాల పనులకు ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలోనే ఫోల్డబుల్ ల్యాప్ ట్యాప్‌లను కూడా తీసుకొచ్చేందుకు మరికొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

Updated Date - Feb 03 , 2024 | 03:07 PM

Advertising
Advertising