Google Maps: వినియోగదారుల గోప్యత కోసం గూగుల్ మ్యాప్స్ నుంచి మరో ఫీచర్
ABN, Publish Date - Jun 06 , 2024 | 02:24 PM
వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు గూగుల్ మ్యాప్స్ (Google Maps) మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం గూగుల్ వినియోగదారుల లోకేషన్ డేటాను నిర్వహించే విధానాన్ని మారుస్తోంది. అయితే ఈ అప్లికేషన్ గతంలో గూగుల్ సర్వర్‌లలో అందుకు సంబంధించిన డేటా చరిత్రను నిల్వ చేసేది.
వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు గూగుల్ మ్యాప్స్ (Google Maps) మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం గూగుల్ వినియోగదారుల లోకేషన్ డేటాను నిర్వహించే విధానాన్ని మారుస్తోంది. అయితే ఈ అప్లికేషన్ గతంలో గూగుల్ సర్వర్‌లలో అందుకు సంబంధించిన డేటా చరిత్రను నిల్వ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం వినియోగదారుల పరికరాలలో మాత్రమే సేవ్ చేయబడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ హిస్టరీ ఫీచర్‌ని టైమ్‌లైన్‌గా మార్చింది. ఇప్పటికే కొంతమంది వినియోగదారులకు గూగుల్ ఈ ఫీచర్‌ను క్రమంగా విడుదల చేస్తున్నట్లు తెలిసింది.
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుల డేటా సురక్షితంగా ఉంటుంది. ఈ క్రమంలో వినియోగదారులు ప్రయాణించిన లొకేషన్ హిస్టరీ(location history) వారి నియంత్రణలోనే ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వినియోగదారుల డేటా కోసం క్లౌడ్ సర్వర్‌లపై కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మీరు ఏ రెస్టారెంట్‌కు వెళ్లిన మీ Android లేదా iOS పరికరంలోని మీ ఫోన్‌లోనే డేటా సేవ్ అవుతుంది. మ్యాప్స్‌లోని టైమ్‌లైన్ కోసం Google ఎండ్ టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ బ్యాకప్‌లను అందిస్తారు. వినియోగదారులు మాత్రమే ఈ బ్యాకప్‌ని యాక్సెస్ చేయగలరు.
వినియోగదారుల కోసం మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. టైమ్‌లైన్(timeline) వెబ్ వెర్షన్ వెబ్‌లో అందుబాటులో ఉండదు. వినియోగదారులు వెబ్ ఇంటర్‌ఫేస్ ద్వారా వారి లొకేషన్ హిస్టరీని యాక్సెస్ చేయవచ్చు. కానీ ఈ మార్పు డెస్క్‌టాప్‌ల కోసం అందుబాటులో ఉండదు. ఆండ్రాయిడ్, iOS కోసం Google Mapsలో ఈ ఫీచర్ పని చేస్తూనే ఉంటుంది.
ఈ ఫీచర్ ఇప్పటికీ ప్రాసెస్‌లో ఉన్నందున టైమ్‌లైన్ డేటా ఫీచర్ గురించి మీకు మరికొన్ని రోజుల్లో అప్‌డేట్ రానుంది. ఇది మీకు వచ్చినప్పుడు Google Maps నుంచి ఇమెయిల్ ద్వారా పుష్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన మెయిల్ ద్వారా మీరు అప్‌డేట్ బటన్ నొక్కడంతో ఇప్పటికే ఉన్న లొకేషన్ హిస్టరీని మీ పరికరానికి తరలించడానికి ప్రాంప్ట్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
Mobiles: ఫోన్ల వెనక వాలెట్లు ఉంచుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా
Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి
Read Latest Technology News and Telugu News
Updated Date - Jun 06 , 2024 | 02:25 PM