ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్రూప్‌-1 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించాలి

ABN, Publish Date - May 31 , 2024 | 11:27 PM

గ్రూప్‌-1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ఈనెల 9న నిర్వహించే గ్రూప్‌-1 కు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

కలెక్టర్‌ నారాయణ రెడ్డి

వికారాబాద్‌, మే 31: గ్రూప్‌-1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ఈనెల 9న నిర్వహించే గ్రూప్‌-1 కు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షను 13 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 5468 మంది అభ్యర్థులు హాజరు అవుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వికారాబాద్‌లో 7, తాండూర్‌లో 4, పరిగిలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఉండేలా జాగ్రతలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి పోలీస్‌ బందోబస్తు, ప్రొటోకాల్‌ ప్రకారం పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్‌ తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, రవీందర్‌ రెడ్డి, డా.రాజేష్‌, అమరేందర్‌, కృష్ణ పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్‌

నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్‌ పెట్టడం జరుగుతుందని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని సురేష్‌ ఏజెన్సీని వ్యవసాయాధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేసే అవకాశం ఉందని ఇప్పటికైతే 3.12లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మార్కెట్‌ లో 20 రకాల హైబ్రీడ్‌ బ్రాండ్స్‌ అందుబాటులో ఉన్నాయని సూచించారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండి ఏమైనా సమాచారం ఉంటే వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కర్ణాటక, కర్నూల్‌ నుంచి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం ఉందని, గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:27 PM

Advertising
Advertising