ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్షలు
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:32 PM
రెండు రోజులుగా నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా/గద్వాలటౌన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-3 పరీక్షలో భాగంగా సోమవారం నిర్వహించిన పేపర్-3 పరీక్షకు వనపర్తి జిల్లాలో మొత్తం 8,312 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,565 మంది మాత్రమే హాజరయ్యారని పరీక్షల రీజనల్ కోఆర్డినేటర్ రామ్‌నరేష్ యాదవ్ తెలిపారు. మరో 3,747 మంది అభ్యర్థులు గైర్హాజరు అయినట్లు ఆయన పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 8,570 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,756 మంది మాత్రమే హాజరయ్యారని, 3,814 మంది గైర్హాజరయ్యారు.
Updated Date - Nov 18 , 2024 | 11:32 PM