ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NPCI: విదేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు.. ఈ సెట్టింగ్స్ చేసుకోండి

ABN, Publish Date - Mar 28 , 2024 | 06:27 PM

NPCI బోర్డు.. RBI ఆమోదంతో భారత్ వెలుపల రూపే (డొమెస్టిక్ కార్డ్ స్కీమ్), UPI పేమెంట్స్ అమలు చేయడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)ని ప్రారంభించింది. UPI ప్రస్తుతం భారత్‌ సహా భూటాన్, మారిషస్, సింగపూర్, శ్రీలంక, UAE, ఫ్రాన్స్‌ వంటి ఆరు దేశాల్లో అందుబాటులో ఉంది.

ఢిల్లీ: NPCI బోర్డు.. RBI ఆమోదంతో భారత్ వెలుపల రూపే (డొమెస్టిక్ కార్డ్ స్కీమ్), UPI పేమెంట్స్ అమలు చేయడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)ని ప్రారంభించింది. UPI ప్రస్తుతం భారత్‌ సహా భూటాన్, మారిషస్, సింగపూర్, శ్రీలంక, UAE, ఫ్రాన్స్‌ వంటి ఆరు దేశాల్లో అందుబాటులో ఉంది.

మీరు ఈ దేశాలలో ఎక్కడికైనా ప్రయాణం చేస్తే.. అక్కడ ఆన్‌లైన్ చెల్లింపులు ఇక ఈజీ. ఇందుకోసం యూపీఐ యాప్‌లో యూపీఐ ఇంటర్నేషనల్‌ని యాక్టివేట్ చేయవచ్చు. PhonePe, Google Pay, BHIMలో యూపీఐ ఇంటర్నేషనల్‌ని యాక్టివేట్ చేయడానికి కింది స్టెప్స్ ఫాలోకండి.

ఫోన్ పేలో

  • PhonePe యాప్‌ని తెరవండి.

  • పైన లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న ప్రొఫైల్ చిత్రంపై నొక్కండి.

  • "Payment Settings"కి వెళ్లండి.

  • "UPI International" ఆప్షన్ ఎంచుకోండి.

  • అంతర్జాతీయ చెల్లింపుల కోసం ఉపయోగించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతా పక్కన ఉన్న "యాక్టివేట్" బటన్ నొక్కండి.

  • యాక్టివేషన్‌ని నిర్ధారించడానికి మీ UPI పిన్‌ని నమోదు చేయండి.


గూగుల్ పేలో..

  • Google Pay యాప్‌ని తెరవండి.

  • "QR కోడ్‌ని స్కాన్ చేయి" అనే ఆప్షన్‌పై నొక్కండి.

  • విదేశీ వ్యాపారి QR కోడ్‌ని స్కాన్ చేయండి.

  • చెల్లించవలసిన విదేశీ కరెన్సీ మొత్తాన్ని నమోదు చేయండి.

  • చెల్లింపు కోసం ఉపయోగించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.

  • మీ బ్యాంక్ UPI ఇంటర్నేషనల్‌కు మద్దతిస్తే, ఈ ప్రక్రియలో మీకు “UPI ఇంటర్నేషనల్‌ని యాక్టివేట్ చేయండి” అనే ఆప్షన్ కనిపిస్తుంది.

  • "UPI ఇంటర్నేషనల్‌ని యాక్టివేట్ చేయి" అనే ఆప్షన్‌పై నొక్కండి. దాన్ని UPI పిన్‌తో నిర్దారించండి.

భీమ్ యాప్‌లో..

  • BHIM యాప్‌ను తెరవండి.

  • ప్రొఫైల్ విభాగానికి వెళ్లండి.

  • "My Linked Bank Accounts" విభాగంలో మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.

  • "UPI గ్లోబల్" పై నొక్కండి.

  • ఫీచర్ కోసం చెల్లుబాటు వ్యవధిని ఎంచుకోండి (ఉదా: 3 నెలలు, 6 నెలలు).

  • యాక్టివేషన్‌ని నిర్ధారించడానికి UPI పిన్‌ని నమోదు చేయండి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 06:27 PM

Advertising
Advertising