ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Instagram: ఇన్‌స్టా నుంచి సరికొత్త ఫీచర్..ఇకపై స్క్రీన్ టైం..

ABN, Publish Date - Jan 20 , 2024 | 05:55 PM

మీ ఇంట్లో చిన్నారులు లేదా యువత ఎక్కువగా నైట్ టైం Instagram ఉపయోగిస్తున్నారా. అయితే భయాందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే తాజాగా వారి స్ర్కీన్ టైం రాత్రివేళల్లో కట్టడి చేసేందుకు ఇన్ స్టా నుంచి సరికొత్త ఫీచర్ నైట్‌టైమ్ నడ్జెస్‌(Nighttime Nudges) అందుబాటులోకి వచ్చింది.

మీ ఇంట్లో చిన్నారులు లేదా యువత ఎక్కువగా నైట్ టైం Instagram ఉపయోగిస్తున్నారా. అయితే భయాందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే తాజాగా వారి స్క్రీన్ టైం రాత్రివేళల్లో కట్టడి చేసేందుకు ఇన్ స్టా నుంచి సరికొత్త ఫీచర్ నైట్‌టైమ్ నడ్జెస్‌(Nighttime Nudges) అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఆన్‌లో ఉంటే వినియోగదారులు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నోటిఫికేషన్‌లను పొందుతారు. దీని ద్వారా పిల్లలు అర్థరాత్రి వరకు ఆ యాప్‌ను ఉపయోగించకుండా నిరోధించవచ్చు.


ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఈ క్రమంలోనే Meta తన వినియోగదారుల కోసం Nighttime Nudges అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగించే వారి కోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా యువకులు లేదా చిన్నారులు అర్థరాత్రి వరకు ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా యాప్‌ను ఉపయోగించకుండా నిరోధిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్ల మంది ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది యుక్త వయస్సులో ఉన్న వారు ఇన్‌స్టాగ్రామ్ వినియోగిస్తున్నారు. దీంతోపాటు చిన్న పిల్లల గోప్యత, భద్రత కోసం కూడా కంపెనీ పని చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ నైట్‌టైమ్ నడ్జెస్ అనే ఫీచర్‌ను ఇచ్చింది. మెటా ఈ కొత్త ఫీచర్ ద్వారా పిల్లలున్న తల్లిదండ్రులకు కొంత ఉపశమనం లభించనుంది.

ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత వినియోగదారులు దీన్ని 10 నిమిషాల కంటే ఎక్కువ ఉపయోగించలేరు. యాప్ ప్రతి 10 నిమిషాలకు వినియోగదారులకు రిమైండర్‌లను పంపుతుంది. ఈ ఫీచర్ పిల్లలను ఇన్‌స్టాగ్రామ్‌ను లాగ్ ఆఫ్ చేయమని కూడా అడుగుతుంది.

Updated Date - Jan 20 , 2024 | 05:55 PM

Advertising
Advertising