Jio: రూ.276కే రోజుకి 2.5 జీబీ డేటా.. అదిరిపోయిన జియో ప్లాన్
ABN, Publish Date - Jul 18 , 2024 | 10:49 AM
దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను యథావిధిగా అందిస్తూనే ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను యథావిధిగా అందిస్తూనే ఉంది. జియో ప్రస్తుతం రూ. 3,599, రూ.3,999 తో రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. తరచూ రీఛార్జ్‌లు చేసుకోకూడదనుకున్న వారికి ఈ రెండు ప్లాన్‌లు బెస్ట్ ఆప్షన్.
రూ. 3,599 వార్షిక ప్లాన్
పైన చెప్పిన రెండు వార్షిక ప్లాన్‌లు వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో, డేటాతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తున్నాయి. జియో సిమ్ వాడుతున్నట్లైతే ఏడాది మొత్తంలో అపరిమిత డేటాను పొందాలనుకునే వారికి ఈ రీచార్జ్ ప్లాన్ మంచిది. అయితే ఈ రెండింటిలో రూ. 3,599 వార్షిక ప్లాన్ బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది వార్షిక రీఛార్జ్ అవసరాలకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తుంది.
ఈ ప్లాన్‌తో నెలకు రూ. 276 కడుతున్నట్లు లెక్క. ఏడాది పొడవునా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్‌లను అందిస్తుంది. 912GB కంటే ఎక్కువ డేటాను అందిస్తుంది. అంటే రోజుకు 2.5GB అనమాట. వినియోగదారులు అపరిమిత 5G డేటాను ఉచితంగా ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. అదనంగా జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తాయి.
రూ. 3,999 వార్షిక ప్లాన్
రూ. 3,999 వార్షిక ప్లాన్ 365 రోజుల పాటు కొనసాగుతుంది. రూ. 3,599 ప్లాన్ విధంగానే ఇది కూడా వినియోగదారులకు 912.5GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు రోజుకు 2.5GBని ఉపయోగించుకోవచ్చు. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పొందుతారు.
For Latest News and National News click here
Updated Date - Jul 18 , 2024 | 10:49 AM