మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Smart Phone: రూ.8 వేలకే 50 మెగా పిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్

ABN, Publish Date - Mar 23 , 2024 | 01:40 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా నుంచి Lava O2 మోడల్ ఫోన్ దేశీయ మార్కెట్లో ఇటివల లాంచ్ అయ్యింది. ఇది లావా ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. అయితే 50 ఎంపీ కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.

Smart Phone: రూ.8 వేలకే 50 మెగా పిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా(lava) నుంచి Lava O2 మోడల్ ఫోన్ దేశీయ మార్కెట్లో ఇటివల లాంచ్ అయ్యింది. ఇది లావా ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే, 720x1,600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వచ్చింది. డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 269ppi పిక్సెల్ డెన్సిటీని కల్గి ఉంది. ఫోటోగ్రఫీ కోసం దీనిలో 50 మెగాపిక్సెల్‌లతో AI సపోర్ట్ డ్యూయల్ కెమెరా(Dual Rear Camera) ఉండగా.. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ఈ కొత్త ఫోన్‌లో octa core Unisoc T616 ప్రాసెసర్‌, 8GB RAM సపోర్ట్‌, వర్చువల్ ర్యామ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్ (నానో) వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతర్గత మెమరీ 128GB, దీనిని కార్డ్ సహాయంతో 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 4G VoLTE, బ్లూటూత్ 5, GPRS, OTG, Wi-Fi 802.11 b/g/n/ac, 3.5mm ఆడియో జాక్, USB టైప్ C పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది.


భద్రత కోసం ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీని బ్యాటరీ 5,000mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 38 గంటల టాక్ టైమ్, 500 గంటల స్టాండ్‌బై లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఆకుపచ్చ, ఊదా, బంగారు రంగు ఎంపికలలో ప్రారంభించబడింది. 8GB + 128GB వేరియంట్ ధర(price) రూ.8,499గా ప్రకటించారు. ఇది అమెజాన్‌తోపాటు లావా స్టోర్లలో కూడా లభిస్తుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Whatsup: వాట్సప్‌లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై ఆ విషయంలో టెన్షన్ అక్కర్లేదు

Updated Date - Apr 23 , 2024 | 09:14 AM

Advertising
Advertising