Smart Phone: మీ మాటలను మీ ఫోన్ వింటోంది.. అదెలాగో తెలుసా?
ABN, Publish Date - Sep 05 , 2024 | 07:55 PM
Smart Phone: గోడలకు చెవులుంటాయని అంటుంటారు.. గొడలకే కాదు.. మనం వాడే మొబైల్ ఫోన్లకు కూడా చెవులుంటాయని మీకు తెలుసా? అదేంటి ఫోన్లలో ఎలాగూ రీసవర్స్ ఉంటాయి కదా? అని అంటారా? అవి కాల్స్ మాట్లాడేటప్పుడు.. ఏదైనా రికార్డ్స్ చేసేటప్పుడు మనం మాన్యూవల్‌గా ఓకే చేస్తేనే పని చేస్తాయి.
Smart Phone: గోడలకు చెవులుంటాయని అంటుంటారు.. గొడలకే కాదు.. మనం వాడే మొబైల్ ఫోన్లకు కూడా చెవులుంటాయని మీకు తెలుసా? అదేంటి ఫోన్లలో ఎలాగూ రీసవర్స్ ఉంటాయి కదా? అని అంటారా? అవి కాల్స్ మాట్లాడేటప్పుడు.. ఏదైనా రికార్డ్స్ చేసేటప్పుడు మనం మాన్యూవల్‌గా ఓకే చేస్తేనే పని చేస్తాయి. కానీ, మనం మొబైల్‌ను వినియోగించకుండా పక్కన పడేసినా మన ఫోన్లు మన మాటలను వింటాయి. మొబైల్ ఫోన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహకారంతో ఇది సాధ్యమవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
మనం మాట్లాడుకునే అంశాలన్నీ మన ఫోన్లు వింటాయనే ప్రచారం ఏళ్లుగా జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లలో పొందుపరిచిన ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సహాయంతో అవి మన మాటలను వినగలవని టెక్ సంస్థలు ధృవీకరించాయి. అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఫోన్ మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్, ఫేస్‌బుక్ వినయోగదారుల ఏజెన్సీ అంగీకరించాయి. మార్కెటింగ్‌కు సంబంధించిన వివరాలను మాత్రమే ఇది గ్రహిస్తుందని చెబుతున్నారు. అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాఫీ మేకర్ గురించి ప్రస్తావించారనుకోండి.. ఆ మాటలను మీ ఫోన్ వింటుంది. మీరు దేని గురించి అయితే చర్చించారో ఆ ప్రోడక్ట్స్‌కి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్స్ మీ మొబైల్‌లో కనిపిస్తుంటాయి. మీరు కావాలనుకుంటున్న పోడక్ట్స్ ఎక్కడ కొనుగోలు చేయొచ్చు అనేది తెలియజేస్తూ ప్రకటనలు ఎక్కువగా వస్తాయి.
సాధారణంగా మనం ఫోన్లలో వచ్చే ప్రకటనలు చూసి గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. కానీ, వాస్తవానికి మాత్రం మనం గూగుల్‌లో వెతికే వాటి గురించి మాత్రమే కాకుండా.. మనం మాట్లాడే వాటి గురించి కూడా ఫోన్లలో అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తుంటాయి. ఫోన్‌లో ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్ మన మాటలను అర్థం చేసుకుని.. మనం ఏం కావాలనుకుంటున్నామో గ్రహించి, వాటిని మనకు చూపిస్తుందట.
పలు నివేదికల ప్రకారం.. వినియోగదారులకు ఏం కావాలనే దానిని తెలుసుకునేందుకు యాక్టివ్ లిజనింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్లలో ఏర్పాటు చేస్తారట. ఈ సాఫ్ట్‌వేర్ వినియోగదారు ఉద్దేశంపై రియల్ టైమ్ డేటాను సేకరించడానికి ఏఐని ఉపయోగిస్తుందట. వినియోగదారుల సంబాషణలను పర్యవేక్షించి.. విశ్లేషించడం ద్వారా వారికి అవసరమైన వాటిని అడ్వర్టైజ్ రూపంలో అందిస్తుందట. ఎవరైనా ఏదైనా కొనుగోలు చేసేందుకు పదే పదే మొబైల్‌లో చూస్తుంటారు. అలా కమిటెడ్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవడానికి కంపెనీలకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపకరిస్తుందట. తద్వారా అవసరమైన ప్రకటనలను వారికి డిస్‌ప్లే చేస్తుంది. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేరు ఈ డేటా సేకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, దీనికి చట్టబద్ధత ఉంటుందని అంటున్నారు. వినియోగదారులు తమ మొబైల్స్‌లో ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసినప్పుడు అందులో టర్మ్స్ అండ్ కండీషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అందులోనే ఈ వివరాలన్నీ పొందుపరుస్తారట సదరు యాప్ యజమానులు. సో.. చట్టపరమైన ఇబ్బందులేమీ ఎదురవకుండా ఉంటాయట.
Also Read:
ఆర్కే రోజాకి ఆనం వార్నింగ్
మళ్లీ పొంగిన బుడమేరు ..
సీఎం కేజ్రీవాల్ బెయిల్ తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
For More Technology News and Telugu News..
Updated Date - Sep 05 , 2024 | 07:55 PM