WhatsApp: వాట్సాప్ యూజర్లకు తీపికబురు.. అందుబాటులోకి సరికొత్త ఫీచర్
ABN, Publish Date - Mar 11 , 2024 | 03:16 PM
మెటా (Meta) సంస్థ తన వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గాను రకరకాల ఫీచర్లను (Features) తీసుకొస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతోంది. ఈ ఫీచర్.. యూజర్ల ఫోటోలను స్టిక్కర్‌లుగా (Image-to-Sticker) మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మెటా (Meta) సంస్థ తన వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గాను రకరకాల ఫీచర్లను (Features) తీసుకొస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతోంది. ఈ ఫీచర్.. యూజర్ల ఫోటోలను స్టిక్కర్‌లుగా (Image-to-Sticker) మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికే ఫోటోలను స్టిక్కర్స్‌గా మార్చే యాప్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ, మెటా సంస్థ తన యూజర్ల కోసం వాట్సాప్‌లోనే ఈ ఫీచర్‌ని తీసుకురానుంది.
ఈ కొత్త ఫీచర్ చాటింగ్‌లో క్రియేటివ్ ట్విస్ట్‌ని అందిస్తుందని యాజమాన్యం పేర్కొంటోంది. అంటే.. ఈ ఫీచర్ సరదాగా, చాటింగ్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయంగా ఉంటుందని చెప్తున్నారు. ఆల్రెడీ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.6.8 కోసం స్టిక్కర్స్‌లో తమ అవతార్‌లను (Avatars) మేనేజ్ చేసుకునేలా వాట్సాప్ బీటా ఓ ఫంక్షన్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు త్వరలో రాబోయే సరికొత్త ఫీచర్.. భద్రత (Security), గోప్యతను (Privacy) మెరుగుపరుస్తుంది. యూజర్లు తమ చిత్రాల వినియోగాన్ని నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు.. వినియోగదారుల సంభాషణలు మరింత ఎక్స్‌ప్రెసివ్, ఆకర్షణీయంగా చేయాలన్న లక్ష్యంతో వాట్సాప్ తన కీబోర్డ్‌లో యూనికోడ్ 15.1 ఎమోజీలను కూడా చేర్చింది.
అంతేకాదండోయ్.. టెలిగ్రామ్ (Telegram), సిగ్నల్ (Signal) వంటి థర్డ్-పార్టీ అప్లికేషన్‌లకు మెసేజ్‌లు పంపేందుకు వీలుగా వాట్సాప్ ‘చాట్ ఇంటర్‌పెరాబిలిటీ ఫీచర్’ను (Chat Interoperability Feature) అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త అప్‌డేట్.. వివిధ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తుంది. WABetainfo నివేదిక ప్రకారం.. థర్డ్-పార్టీ చాట్‌లకు అంకితమైన విభాగాన్ని అభివృద్ధి చేయడానికి వాట్సాప్ చురుకుగా పని చేస్తోంది.
Updated Date - Mar 11 , 2024 | 03:16 PM