ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Smartphone: మార్కెట్లోకి మోటరోలా ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్..ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

ABN, Publish Date - May 16 , 2024 | 04:13 PM

మోటరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్(smartphone) ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ మోడల్‌ను మే 16న భారత మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ దీనిని స్టైలిష్ లుక్, అనేక శక్తివంతమైన ఫీచర్లతో పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Motorola Edge 50 Fusion price and features

మోటరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్(smartphone) ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ మోడల్‌ను మే 16న భారత మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ దీనిని స్టైలిష్ లుక్, అనేక శక్తివంతమైన ఫీచర్లతో పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. Motorola Edge 50 Fusion 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1080p పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,600 nits అధిక బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,200 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్‌ను కలిగి ఉంది. Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది.


దీంతోపాటు ఇది Android 14తోపాటు Hello UIతో పని చేస్తుంది. కంపెనీ దీనికి మూడు ప్రధాన OS, నాలుగు సంవత్సరాల సెక్యురిటీ ఫీచర్లను అందిస్తోంది. ఇక ఈ ఫోన్‌ 5,000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్లతో లభిస్తుంది. ఇక దీని కెమెరా విషయానికి వస్తే Moto Edge 50 Fusion 50 మెగాపిక్సెల్ Sony LYTIA LYT700C ప్రైమరీ సెన్సార్‌, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.


కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో WiFi 5, బ్లూటూత్ వెర్షన్ 5.2, NFC, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 15 5G బ్యాండ్‌లు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఇతర ఎంపికలు ఉన్నాయి. ఇది IP68 రేటెడ్, 175 గ్రాముల బరువును కల్గి ఉంది. భారతదేశంలో 8GB RAM, 128GB బేస్ మోడల్ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 22,999 కాగా, 12GB RAM, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ ధర రూ. 24,999గా ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్లో కొనుగోలు చేస్తే దాదాపు 2000 తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఇది కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త


Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News

Updated Date - May 16 , 2024 | 04:15 PM

Advertising
Advertising