ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nothing 2a: నథింగ్ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు..ఏకంగా రూ.10 వేల తగ్గింపు ఆఫర్!

ABN, Publish Date - Mar 12 , 2024 | 07:10 PM

దేశంలో(india) నథింగ్ స్మార్ట్‌ఫోన్(Nothing Phone 2a) సేల్స్ మొదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్‌(sale)పై ఈరోజు బంపర్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999 ఉండగా ఆఫర్ రేటులో రూ.19,999కే ఫ్లిప్‌కార్టు(Flipkart)లో లభించనున్నట్లు ప్రకటించారు.

దేశంలో(india) నథింగ్ స్మార్ట్‌ఫోన్(Nothing Phone 2a) సేల్స్ మొదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్‌(sale)పై ఈరోజు బంపర్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999 ఉండగా ఆఫర్ రేటులో రూ.19,999కే ఫ్లిప్‌కార్టులో లభించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను ఇప్పుడు చుద్దాం. నథింగ్ ఫోన్ 2aలో 6.7 అంగుళాల FullHD + AMOLED డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5 ఫోన్‌తో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ 12 GB RAM, 256 GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నథింగ్ ఫోన్ 2A స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కేవలం 23 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతానికి, 59 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. హ్యాండ్‌సెట్‌లో రీడిజైన్ చేయబడిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, IP54 రేటింగ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


ఇక 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 25,999కి కొనుగోలు చేయవచ్చు, 12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్‌ రూ. 27,999కి అందుబాటులో ఉంది. ఈ నథింగ్ ఫోన్‌ను ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయడం ద్వారా, మీరు ఇయర్ 2 బడ్స్, GaN ఛార్జర్‌పై బండిల్ డీల్‌లను పొందుతారు. మొదటి మోడల్ ఫోన్ HDFC బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో రూ. 21,999కి కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.19,999కు వస్తుందని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Jio: పేమెంట్స్ సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో..వీరికి గట్టి పోటీ

Updated Date - Apr 23 , 2024 | 09:49 AM

Advertising
Advertising