ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్న వర్షాలకే ఛిద్రం..

ABN, Publish Date - Jul 08 , 2024 | 12:38 AM

రామడుగు మండలంలో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్లపై గుంతలు పడి రాకపోలకు ఇబ్బంది కలిగినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు పడనే లేదు. అప్పుడే గ్రామీణప్రాంతాల్లోని రోడ్లు దెబ్బతింటున్నాయి. జిల్లాలోని పలు రోడ్లు అధ్వానస్థితికి చేరాయి. పలుచోట్ల రోడ్లు గుంతమయమయ్యాయి. దీంతో ఆయా రోడ్డుపై ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రామడుగు, జూలై 7: రామడుగు మండలంలో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్లపై గుంతలు పడి రాకపోలకు ఇబ్బంది కలిగినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో అంతర్గత రోడ్లు చినుకుపడితే చిత్తడి అవుతున్న పరిస్థితి ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి అంతకంటే అధ్వానంగా తయారైంది. రామడుగు మండల కేంద్రంలో రైతు వేదిక సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ గుంతలు పడి వర్షపు నీరుతో నిండి చెరువును తలపిస్తోంది. గోపాల్‌రావుపేట నుంచి కరీంనగర్‌ ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుండగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మోకాలు లోతు గుంత ఉండి రోడ్డంతా జలమయం కావడంతో భారీ వాహనాలు వెళ్లాలంటే కష్టంగా మారింది. ద్విచక్ర వాహనదారులు పక్క నుంచి భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాదారులు నరకాన్ని చవి చూస్తున్నారు. ఇంత ఇబ్బంది పడుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నరంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోపాల్‌రావుపేటలో బూరుగుపల్లికి వెళ్లే ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలమాయంగా మారింది. గుంతల్లో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. వర్షం పడితే గుంతలమాయంగా మారిన రహదారిపై ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రహదారుల గుండా నిత్యం కరీంనగర్‌, జగిత్యాల జిల్లా కేంద్రాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రామడుగు మండల కేంద్రంలోని వాగు వంతెన నుంచి మొదలుకుంటే చిప్పకుర్తి శివారు రైతు వేదిక వరకు రోడ్డు గుంతలమాయంగా మారింది. అన్ని గ్రామాల్లోనూ రోడ్ల పరిస్థితి ఇలాగే ఉన్న ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలమాయంగా మారిన ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లను మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ అధ్వానంగా గుంపుల రోడ్‌

జమ్మికుంట రూరల్‌: జమ్మికుంట మండలం తనుగుల గ్రామ పరిధిలోని గుంపుల ఎక్స్‌ రోడ్‌ అధ్వానంగా మారింది. ఎక్స్‌ రోడ్‌ నుంచి గుంపుల ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ఎంట్రన్స్‌ వరకు ఉన్న బీటి రోడ్డు గుంతల మయం అయింది. భారీ ఇసుక లోడుతో లారీల రాకపోకల వల్ల రోడ్డు పూర్తిగా ధ్వసమైంది. జమ్మికుంట మీదుగా కాల్వశ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి వైపు వెళ్లే ప్రయాణికులకు గుంపుల ఎక్స్‌ రోడ్‌ నుంచే వెళతారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్‌ వాహనదారులు ఆ రోడ్డు మీదుగా వెళ్లాలంటే జంకుతున్నారు. వాహనాల సస్పెన్షన్లు పోయి మరమ్మతులకు వేలాది రూపాయాలు ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:38 AM

Advertising
Advertising
<