Smartphone: పోకో F6 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ షురూ..ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
ABN, Publish Date - May 29 , 2024 | 01:29 PM
స్మార్ట్‌ఫోన్ల(Smartphones) తయారీ సంస్థ పోకో(Poco) గత వారం వినియోగదారుల కోసం కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Poco F6 5G మోడల్‌ని లాంచ్ చేసింది. నేటి (మే 29) నుంచి ఈ ఫోన్ల సేల్స్ మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
స్మార్ట్‌ఫోన్ల(Smartphones) తయారీ సంస్థ పోకో(Poco) గత వారం వినియోగదారుల కోసం కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Poco F6 5G మోడల్‌ని లాంచ్ చేసింది. నేటి (మే 29) నుంచి ఈ ఫోన్ల సేల్స్ మొదలయ్యాయి. మీరు కూడా ఈ కొత్త Poco స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా ఈ ఫోన్ ఫీచర్లు, ధర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
POCO F6 5G దేశంలోనే మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌తో అధికారికంగా భారతదేశంలో ప్రవేశించింది. Poco F6 5G స్టార్ట్ ఫోన్ 6.67 అంగుళాల 1.5K (1,220x2,712 పిక్సెల్‌లు) రిజల్యూషన్, AMOLED ప్యానెల్‌తో వస్తుంది. దీంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, వైడ్‌వైన్ L1 సపోర్ట్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 2,400 నిట్స్, కార్నింగ్ గొరిల్లా విక్టస్ రక్షణను పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌తో 12GB LPDDR5x RAM, 512 GB స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌లో నడుస్తుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే Poco F6 ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ కలదు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంది. ఇది 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS/AGPS, గెలీలియో, GLONASS, Beidou, USB టైప్ C పోర్ట్ స్టాండర్డ్ కనెక్టివిటీ ఫీచర్లతో లభిస్తుంది. ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్, హై రెస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది.
Poco నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో ప్రారంభించబడింది. మొదటి వేరియంట్ 8GB RAM+ 256GB నిల్వతో వస్తుండగా, ఈ వేరియంట్ కోసం మీరు రూ. 29,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక 12GB RAM+256GB స్టోరేజీని అందించే వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. 31,999 చెల్లించాల్సి ఉంటుంది. చివరగా 12GB RAM+ 512GB స్టోరేజ్ వేరియంట్ కోసం మీరు రూ. 33,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. Poco F6 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి:
WhatsApp: భద్రత విషయంలో రాజీ పడం.. ఎలాన్ మస్క్ ఆరోపణలపై వాట్సప్ చీఫ్ స్పందన
Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి
Read Latest Technology News and Telugu News
Updated Date - May 29 , 2024 | 01:33 PM