ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుంది

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:56 AM

ఏడాది క్రితం అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ ఆరోపించారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న దావ వసంత

జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌

జగిత్యాల అగ్రికల్చర్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏడాది క్రితం అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని స్థానిక ధరూర్‌ క్యాంప్‌లో గల అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరిశీలిం చారు. అక్కడున్న సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలు, సమస్యలు అడిగితెలుసుకొని, విద్యార్థులతో కలిసి ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడు తూ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యంత దయనీయ పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభు త్వం అరకొర నిధులు ఏర్పాటు చేస్తుందని, కనీసం నాణ్యమైన భోజనం పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శిం చారు. మాజీ సీఎం కేసీఆర్‌ విద్యాభివృద్దికై గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిం దన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:56 AM