మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Meta: మెటా నుంచి బ్లాస్టింగ్ ఫీచర్.. ఏఐ ఇమేజ్‌లు ఇక వాట్సప్‌లోనే

ABN, Publish Date - Mar 24 , 2024 | 05:38 PM

వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు క్రోమ్ బ్రౌజర్లో వేర్వేరు సైట్‌లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది.

Meta: మెటా నుంచి బ్లాస్టింగ్ ఫీచర్.. ఏఐ ఇమేజ్‌లు ఇక వాట్సప్‌లోనే

ఇంటర్నెట్ డెస్క్: వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇన్నాళ్లూ క్రోమ్ బ్రౌజర్లలో వేర్వేరు సైట్‌లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు ఆ బాధేమీ లేకుండా.. వాట్సప్‌లోనే డైరెక్ట్‌గా ఏఐ ఇమేజ్‌లను మనకి నచ్చినట్లు చేసుకునే వెసులుబాటు కల్పించబోతోంది. ఇందుకోసం ఏఐ పవర్డ్ ఎడిటింగ్ టూల్‌ని డెవలప్ చేస్తోంది. దీన్ని ఉపయోగించి ఏఐ ఇమేజ్‌లను నచ్చిన విధంగా అందంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఏఐ సాయంతో ఇమేజ్ బ్యాక్‌ గ్రౌండ్‌ని సవరించడం, రీస్టైల్ చేయడం సులభం కానుంది. దీనితో పాటు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు వాట్సప్ కృషి చేస్తోంది.

ఇకపై వినియోదారులు తమ ప్రశ్నలు, సందేహాలను మెటా ఏఐ(Meta AI) టూల్‌తో వాట్సప్‌లో అడగొచ్చు. ఇది చాట్ బాట్‌లాగా ఉపయోగపడుతుంది. Meta AI OpenAIకి చెందిన ChatGPTతో పోటీపడేలా రూపొందించారు. ఈ ఫీచర్లు ఇంకా డెవలప్‌మెంట్ దశలో ఉన్నాయి. బీటా ఛానల్‌లోని టెస్టర్‌లతో సహా వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఫీచర్లు గనక అందుబాటులోకి వస్తే వినియోగదారులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడనుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 05:46 PM

Advertising
Advertising