ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Smartphones Addiction: స్మార్ట్ ఫోన్‌ బానిసలు అత్యధికంగా ఏ దేశంలోనంటే?

ABN, Publish Date - Jun 30 , 2024 | 07:46 PM

స్మార్ట్‌ఫోన్‌లు... మనిషి జీవితంలో ఒక విడదీయలేని ఎలెక్ట్రానిక్ పరికరంగా మారాయి. విద్య, వినోదం, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆన్ లైన్ చెల్లింపులు మొదలైన ఎన్నో పనులను ఫోన్లు సులభతరం చేశాయి. దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న యూజర్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్‌లు... మనిషి జీవితంలో ఒక విడదీయలేని ఎలెక్ట్రానిక్ పరికరంగా మారాయి. విద్య, వినోదం, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆన్ లైన్ చెల్లింపులు మొదలైన ఎన్నో పనులను ఫోన్లు సులభతరం చేశాయి. దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న యూజర్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.

స్మార్ట్ ఫోన్‌ని అవసరానికి వాడితే తప్పేమి కాదు. అనవసరంగా వినోదానికో మరొక పనికో వాడితే బానిసగా(Smartphones Addiction) మారతారు. ఫోన్లకు బానిసగా మారిన దేశాలపై మెక్ గిల్ విశ్వవిద్యాలయం ఇటీవల ఓ అధ్యయనం జరిపింది. అనంతరం ఓ జాబితా విడుదల చేసింది.


భారత్‌లో..

ఈ పరిశోధన నివేదిక ప్రకారం, చైనాలో అత్యధిక మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్ వ్యసన సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో సౌదీ అరేబియా 2వ స్థానంలో ఉండగా, మలేసియా మూడో స్థానంలో ఉంది. బ్రెజిల్, దక్షిణ కొరియా వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచాయి. స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌తో భారత దేశ ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్‌లకు బానిసగా మారిన టాప్ 24 దేశాలు ఇవే..

  1. చైనా

  2. సౌదీ అరేబియా

  3. మలేసియా

  4. బ్రెజిల్

  5. దక్షిణ కొరియా

  6. ఇరాన్

  7. కెనడా

  8. టర్కీ

  9. ఈజిప్ట్

  10. నేపాల్

  11. ఇటలీ

  12. ఆస్ట్రేలియా

  13. ఇజ్రాయెల్

  14. సెర్బియా

  15. జపాన్

  16. యునైటెడ్ కింగ్‌డమ్

  17. భారతదేశం

  18. అమెరికా

  19. రొమేనియా

  20. నైజీరియా

  21. బెల్జియం

  22. స్విట్జర్లాండ్

  23. ఫ్రాన్స్

  24. జర్మనీ

For Latest News and National News click here

Updated Date - Jun 30 , 2024 | 07:46 PM

Advertising
Advertising