Iphone 16 Series: ఐఫోన్ 16 కొనాలా? వద్దా? అని డౌటా? అయితే..
ABN, Publish Date - Sep 17 , 2024 | 08:01 PM
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ కొనుక్కోవాలా? వద్దా? అని సందేహిస్తున్నారా? సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వంటివి పాత ఫోన్లకు మరికొంత కాలం కొనసాగుతాయనుకుంటే అప్‌గ్రేడేషన్ వాయిదా వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 20 నుంచి ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. కస్టమర్ల కోసం ఇప్పటికే యాపిల్ సంస్థ ట్రేడిన్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ వంటి వాటిని ప్రకటించింది. అయితే, ఈ సరిసీస్‌లో ప్రాథమిక వేరియంట్ ధర రూ.79,900గా ఉంది. ఇక అన్ని ఫీచర్లు ఉన్న టాప్ ఎండ్ ఫోన్ ధర రూ. 1,44,900. దీంతో, ఐఫోన్ ప్రియులు కొందరిలో కొత్త ఫోన్ కొనాలా వద్దా అన్న సందేహం నెలకొంది. ఈ సందేహం నివృత్తి చేసుకునేందుకు పలు అంశాలపై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు (Who should upgrade to iphone 16 ).
New Updates: కొత్త సిమ్ కొంటున్నారా.. రూల్స్ మారాయ్, గమనించగలరు
వీరు కొత్త ఫోన్‌కు మారొచ్చు..
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఐఫోన్ 6, ఐఫోన్ 7 వంటి మోడళ్లు వాడుతున్న వారు కొత్త ఫోన్‌కు మారడం మంచిది. ఇప్పటికే యాపిల్ ఈ ఫోన్లకు సపోర్టు నిలిపివేసింది. అంటే.. సెక్యూరిటీ అప్‌డేట్స్ వంటివి ఉండవు. దీంతో, ఈ ఫోన్లు వినియోగించే వారు సైబర్ దాడుల బారిన పడే అవకాశం ఉంది. ఇక ఐఫోన్ 8, ఐఫోన్ 10, ఐఫోన్ ఎక్స్ఎస్ ఫోన్లు వినియోగించే వారు తమకు మరింత సమర్థవంతమైన ఫోన్ కావాలనుకుంటే ఐఫోన్ 16 కొనేందుకు సందేహించనక్కర్లేదు. కెమెరాలు, ప్రాసెసర్ సామర్థ్యం, కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్ వంటి అంశాల్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు కచ్చితంగా మెరుగైనవే.
Apple Watch 10: యాపిల్ వాచ్ 10 సిరీస్ విడుదల.. మెడిసిన్ వేసుకునే రిమైండర్ ఫీచర్‌తోపాటు..
వీళ్లు అప్‌గ్రడేషన్‌ను వాయిదా వేసుకోవచ్చు
ఐఫోన్ 13, 14 లేదా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు వెంటనే ఐఫోన్ 16కు మారాల్సిన అవసరం లేదనేది నిపుణుల మాట. ఈ ఫోన్లకు యాపిల్ సపోర్టు ఇంకా కొంత కాలం పాటు ఉంటుందని, ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ కొనసాగుతాయని చెబుతున్నారు. ఉదాహరణకు, ఐఫోన్ 14 ప్రో మోడల్‌లో కెమెరా సామర్థ్యం అద్భుతం. బ్యాటరీ లైఫ్ కూడా సంతృప్తికరంగా ఉంటుంది. కాబట్టి, లేటెస్ట్ ఫోన్ సొంతం చేసుకోవాలని బలమైన కోరిక ఉంటే మినహా ఇలాంటి వాళ్లు అప్‌గ్రేడేషన్ కోసం తొందరపడనక్కర్లేదు. కాస్తంత డబ్బులు కూడబెట్టుకున్నాక తీరిగ్గా కొత్త ఫోన్‌కు మారొచ్చు.
Read Latest and Technology News
Updated Date - Sep 17 , 2024 | 08:09 PM