ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముదిరాజ్‌ల అభ్యున్నతికి కృషి చేస్తా

ABN, Publish Date - May 06 , 2024 | 11:15 PM

ముదిరాజ్‌ల బిడ్డనై పనిచేస్తానని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు.

- కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి

నారాయణపేట, మే 6 : ముదిరాజ్‌ల బిడ్డనై పనిచేస్తానని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని సీవీఆర్‌ బంగ్లాలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన పాల్గొని మా ట్లాడారు. ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ముదిరాజ్‌లను ముందుండి నడిపేందుకు ఢిల్లీలో వారదిగా తన గొంతును పార్లమెంట్‌లో వినిపించేందుకు హస్తం గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు జిల్లా అభ్యున్నతి కోసం జరుగుతున్నాయన్నారు. బీ జేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మన భవిషత్‌ తరాల బతుకులు నాశనమౌతాయన్నారు. సంక్షేమంతో పాలు సమాజంలో సామాజిక అభివృద్ధి సాధించాలనే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నార న్నారు. ముదిరాజ్‌ల స్వప్నమైన గ్రూప్‌ డీ నుంచి గ్రూప్‌ ఏగా మార్చేం దుకు కృషి చేస్తామ న్నారు. పార్టీలకు అతీతంగా ముదిరాజ్‌లు ఏక మై హస్తంకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు సరాఫ్‌ నాగరాజ్‌, నరహరి, క్రాంతికుమార్‌, సంతోష్‌ కుమార్‌, రాంచందర్‌, హన్మంతు, వెంకటేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పాలమూరు అభివృద్ధే లక్ష్యం

మరికల్‌ : పాలమూరు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని కాంగ్రెస్‌ పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఇందిరాగాంఽధీ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌లో కుంభం శివకుమార్‌ రెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే అన్నారు. మండ లానికి జూనియర్‌ కళాశాల తోపాటు మునిసిపాలిటీ, మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, కాంగ్రెస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2024 | 11:15 PM

Advertising
Advertising