దేవరకొండలో ఒకరోజు 14 కాన్పులు
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:45 PM
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మంగ్తానాయక్ తెలిపారు.
దేవరకొండలో ఒకరోజు 14 కాన్పులు
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మంగ్తానాయక్
దేవరకొండ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మంగ్తానాయక్ తెలిపారు. దేవరకొండలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకొం డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 28 ఉదయం 9 నుంచి 29 ఉదయం 9 గంటల వరకు 14 మహిళలకు ప్రసవాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 14 ప్రసవాల్లో 8 మందికి ఆపరేషన్లు కాగా ఆరుగురు మహిళలకు సాధారణ ప్రసవం అయినట్లు వెల్లడించారు. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రసవాలు చేసిన డ్యూటీ డాక్టర్లు, వైద్య నిపుణులు డాక్టర్ కన్యకుమారి, మోతీలాల్, డాక్టర్ స్వరూప, స్వప్న, శశికళ, హెడ్‌నర్సు నీలమ్మ ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - Nov 29 , 2024 | 11:45 PM