ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేవంత్‌రెడ్డి.. కోర్టుకు రండి!

ABN, Publish Date - Sep 25 , 2024 | 04:07 AM

ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులందరూ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ కేసు విచారణకు జెరూసలేం

వచ్చే నెల 16న కచ్చితంగా రావాలి.. ఇతర నిందితులు కూడా

ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్స్‌ కోర్టు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులందరూ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ కేసు విచారణకు జెరూసలేం మత్తయ్య మినహా మిగిలిన వారెవరూ హాజరు కాకపోవడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి సహా ఈ కేసులో నిందితులు విచారణకు ఎందుకు రావడం లేదని వారి తరఫు న్యాయవాదులను జడ్జి ప్రశ్నించారు. రేవంత్‌తో పాటు ఉదయ్‌ సింహా, వేం కృష్ణ కీర్తన్‌, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌ వచ్చే నెల 16న కచ్చితంగా విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి నామినేటెడ్‌ ఆంగ్లో-ఇండియన్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌ రూ.50 లక్షలు ఇవ్వబోయారనే అభియోగంపై తొలుత ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మార్చాలంటూ మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన అంశాలను సీఎం రేవంత్‌ రెడ్డికి నివేదించవద్దని తెలంగాణ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.

Updated Date - Sep 25 , 2024 | 04:07 AM