ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎం ప్రతిష్ఠకు సవాల్‌!

ABN, Publish Date - May 13 , 2024 | 05:12 AM

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి పోటీ చేస్తుండగా,

రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో హోరాహోరీ.. నాగర్‌కర్నూల్‌లో ప్రతిష్ఠాత్మక పోరు

మల్లు రవికి పరీక్షగా పార్లమెంటు ఎన్నిక.. ప్రభుత్వ పదవిని వదులుకొని బరిలోకి.. గట్టి పోటీ ఇస్తున్న ప్రవీణ్‌కుమార్‌, భరత్‌

నాగర్‌కర్నూల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి పోటీ చేస్తుండగా, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీజేపీ నుంచి మాజీ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్‌ప్రసాద్‌ బరిలో నిలిచారు. స్వయాన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు సోదరుడైన మల్లు రవి.. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ పార్టీ పునర్‌వైభవానికి కృషి చేశారు. అదే ఆయనకు కలిసొచ్చిన అంశంగా మారింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ మంద జగన్నాథ్‌ కూడా కాంగ్రెస్‌ టికెట్‌ కోసం విశ్వప్రయత్నాలు చేసినా.. టికెట్‌ మల్లు రవినే వరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక ఆయనను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించి క్యాబినెట్‌ హోదా కల్పించినా ఆ పదవికి రాజీనామా చేసి మరీ నాగర్‌కర్నూల్‌ ఎంపీగా బరిలోకి దిగారు. కాగా, బీఆర్‌ఎస్‌ తరఫున సిటింగ్‌ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు అనూహ్యంగా తన కుమారుడితో కలిసి బీజేపీలో చేరారు. జడ్పీ చైర్మన్‌ ఎన్నిక విషయంలో తన కుమారుడికి తప్ప వేరొకరికి అవకాశం లేకున్నా.. అప్పటి ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, మరికొందరు జిల్లా ఎమ్మెల్యేలు అధిష్ఠానం వద్ద పావులు కదిపి భరత్‌ప్రసాద్‌కు ఆ పదవి దక్కకుండా చేశారనే కోపంతో రాములు బీఆర్‌ఎ్‌సను వీడారు. బీజేపీలో చేరడంతోనే తన కుమారుడికి టికెట్‌ దక్కించుకున్నారు.

ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి..

రేవంత్‌రెడ్డిని దెబ్బ కొట్టే ఉద్దేశంతో నాగర్‌కర్నూల్‌ స్థానాన్ని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని రాములు తనయుడు భరత్‌ప్రసాద్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత భరత్‌ప్రసాద్‌ నామినేషన్‌ కార్యక్రమానికి గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ను పంపించి.. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పకనే చెప్పారు. ఇక ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వ్యవహారం కూడా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన ప్రవీణ్‌కుమార్‌ అనూహ్యంగా గులాబీ శిబిరంలో చేరారు. ఆ పార్టీ నుంచి బీఫామ్‌ దక్కించుకుని ఎన్నికల బరిలోకి దిగారు. మరోవైపు మాజీ ఎంపీ మంద జగన్నాథ్‌.. కాంగ్రెస్‌ నుంచి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. బీఫామ్‌ కూడా తీసుకొచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే బీఫామ్‌ సమర్పించకపోవడం, తగినంత మంది మద్దతుదారులు లేకపోవడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. కానీ, మూడుసార్లు నాగర్‌కర్నూల్‌ ఎంపీగా, రెండుసార్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగిన మంద జగన్నాథ్‌ అంత అసమగ్రంగా నామినేషన్‌ దాఖలు ఎలా చేశారనే అంశంపై జిల్లాలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

మాదిగలు, బీసీల ఓట్లే కీలకం..

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానంలో మాదిగలు, బీసీల ఓట్లే కీలకం కానున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 17,34,773 మంది ఓటర్లుండగా.. వీటిలో 3లక్షల 54వేల పైచిలుకు ఓట్లు మాదిగ సామాజికవర్గానికి చెందిన వారివే ఉన్నాయి. కాగా, గద్వాల, వనపర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తిలలో మైనారిటీ వర్గం ఓటర్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ.. రైతులు, మైనారిటీ వర్గం వారి ఓట్లను పెద్ద సంఖ్యలో తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా, బీజేపీ.. యువకులు, మహిళలు, అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ ఉద్యోగుల ఓట్లపై కన్నేసింది. బీఆర్‌ఎస్‌ మాత్రం కాంగ్రెస్‌ 150 రోజుల పాలనపై విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

Updated Date - May 13 , 2024 | 05:49 AM

Advertising
Advertising