ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నెరవేరనున్న కల!

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:46 PM

అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ ప్రజల కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్‌ లను, మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఘన్‌పూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది.

రెవెన్యూ డివిజన్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న కడియం (ఫైల్‌)

రెవెన్యూ డివిజనల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు జీవో జారీ

ఫలించిన ఎమ్మెల్యే కడియం కృషి

స్టేషన్‌ఘన్‌పూర్‌లో సమీకృత డివిజనల్‌ కాంప్లెక్స్‌

సమీకృత కలెక్టరేట్‌ తరహాలో ఏర్పాటు

2.35 ఎకరాల స్థలం కేటాయింపు

ఒకేచోట రానున్న 16 ప్రభుత్వ సేవలు

స్టేషన్‌ఘన్‌పూర్‌, నవంబరు 20: అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ ప్రజల కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్‌ లను, మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఘన్‌పూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. ఘన్‌పూర్‌ రెవెన్యూ డివిజన్‌గా మారి ఆరు సంవత్సరాలు కావస్తున్నా కార్యాలయాల ఏర్పాటు జరుగలేదు. సరైన కార్యాలయాలు లేకపో వడంతో అధికారులు సరిగ్గా పని చేయలేక ప్రజలకు మెరుగైన సేవలు అందించలేక పోతున్నారన్నారు. రానున్న రోజుల్లో మెరుగైన సేవలందించడానికి గాను రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రజల కోరిక మేరకు స్టేషన్‌ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రెవెన్యూ డివిజనల్‌ కాంప్లెక్స్‌ సముదాయాన్ని ఏర్పాటు చేసి ప్రజల, అధి కారుల ఇబ్బందులు తొలగించాలని యోచించారు.

శిథిలావస్థలో కార్యాలయాలు..

ఘన్‌పూర్‌ మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఎంపీడీవో కార్యాలయ భవనం 1975లో నిర్మించడం తో శిథిలావస్థకు చేరుకుంది. తహసీల్దార్‌ కార్యాల యం సైతం అనేక ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో శిథిలావస్థలో ఉంది. కొత్తగా వచ్చిన ఆర్డీవో కార్యాల యానికి, ఏసీపీ కార్యాలయాలకు భవనాలు లేకపోవ డంలో తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయి. తహసీ ల్దార్‌, ఎంపీడీవో కార్యాలయ భవనాలను తొలగించి కొత్త వాటిని నిర్మించడం కంటే సమీకృత డివిజన్‌ కార్యాలయాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

స్థలాన్ని పరిశీలించిన కడియం

రెవెన్యూ డివిజనల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటునకు గాను గత జూలై మూడవ వారంలో ఎమ్మెల్యే కడియం మండల కేంద్రంలో స్థలాలను పరిశీలించారు. ఘన్‌ పూర్‌ రైతు వేదిక వెనుకాల ఉన్న స్థలాన్ని, ప్రస్తుత ఎంపీడీవో కార్యాలయం, అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌తో కలిసి పరిశీలించారు. రెండు స్థలాలకు సంబంధించిన స్థలాలను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ అధి కారులను కడియం కోరగా చివరకు ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయం ఉన్నటువంటి 2.35 ఎకరాల స్థలాన్ని డివిజన్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ఫైనల్‌ చేసి ఇంజనీరింగ్‌ అధికారులను ఎస్టిమేషన్స్‌ తయారు చేయించి ఇవ్వాలని ఆదేశించారు. ఇంజనీరింగ్‌ అధికా రులు ఇచ్చిన ఎస్టిమేషన్స్‌, ప్లాన్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, రెవెన్యూ డివిజన్‌ ఆఫీసెస్‌ కాంప్లె క్స్‌ నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం వంబరు 17న రూ.26 కోట్లు కేటాయిస్తూ జీవోను జారీ చేసింది. అనేక ఏళ్ల ప్రజల చిరకాల కల నెరవేరనుంది.

16 శాఖల విధులు ఒకే చోట

రెవెన్యూ డివిజనల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంతో సుమా రు 16 ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు ఒకే చోట నిర్వహించనున్నారు. రెవెన్యూ, వ్యవసాయం, ఇరి గేషన్‌, ఎంపీడీవో, ఈజీఎస్‌, పంచాయతీరాజ్‌, ఆరోగ్య శాఖ, ఐకేపీ, ఐసీడీఎస్‌, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ, ట్రెజ రీ, తదితర శాఖలకు సంబంధించిన సేవలు ఒకే చోటు నుంచి ప్రజలకు అందనున్నాయి.

కాంప్లెక్స్‌ నిర్మాణం ఏర్పాటు ఇలా..

సుమారు 50వేల స్క్వేర్‌ ఫీట్స్‌ విస్తీర్ణంలో సుమా రు 16 శాఖలు ఒకే కాంప్లెక్స్‌ నుంచి సేవలు అందిం చేలా జీప్లస్‌ ప్లస్‌ భవనాలను నిర్మించేలా ఎస్టిమేషన్స్‌ రూపొందించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వాహనాల పార్కిం గ్‌, మొదటి, రెండవ అంతస్తుల్లో వివిధ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్‌ స్థలం, చుట్టూరా గ్రీనరీ ఉండేలా ప్లాన్‌ రూపొందించినట్లు సమాచారం.

ఎమ్మెల్యే కృషితో డివిజనల్‌ కాంప్లెక్స్‌

- ఆర్డీవో ధరంసోత్‌ వెంకన్న

ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో రెవెన్యూ డివిజనల్‌ కాంప్లెక్స్‌ మంజూరైంది. ఒకే చోట అన్ని శాఖల సముదా యాలు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు కానున్నాయి. అధికారులకు సైతం మేలుగా ఉంటుంది. సమయం వృథా కాకుండా అధికారులు వివిధ మీటింగ్‌ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగంగా ఉంటుంది. కాంప్లెక్స్‌ ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన అన్ని రకాల అధికారుల సేవలు అందుతాయి.

పట్టణ రూపురేఖలు మారుతాయి..

- గన్ను నర్సింహులు, మాజీ ఎంపీటీసీ

రెవెన్యూ డివిజనల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుతో ఘన్‌పూర్‌ పట్టణ రూపురేఖలు మారనున్నాయి. పట్టణ అభివృద్ధిలో కాంప్లెక్స్‌ నిర్మాణం మైలురాయిగా నిలవనుంది. గ్రామాల నుంచి వివిధ రకాల పనుల కోసం వచ్చే ప్రజలకు ఒకే చోట అన్ని సేవలు అందుబాటులోకి రావడం హర్షించదగిన విషయం.

Updated Date - Nov 20 , 2024 | 11:46 PM