ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana :వీధి కుక్క దాడిలో ఐదునెలల చిన్నారి మృతి!

ABN, Publish Date - May 15 , 2024 | 04:54 AM

అభం శుభం తెలియని ఓ ఐదు శిశువు వీధి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలో జరిగింది.

తాండూరు రూరల్‌, మే 14: అభం శుభం తెలియని ఓ ఐదు శిశువు వీధి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రం రాయ్‌చూర్‌కు చెందిన నీలం మధు, మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యలకు నాలుగేళ్ల క్రితం వివాహమయింది. వీరికి సాయినాథ్‌ అనే ఐదు నెలల బాబు ఉన్నాడు. తాండూరు మండలం గౌతాపూర్‌ గ్రామం సమీపంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్‌లో వారం క్రితమే మధు పనికి కుదిరాడు.

కుటుంబంతో కలిసి గౌతాపూర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం లావణ్య బాబును ఇంట్లో ఉంచి పాలిషింగ్‌ యూనిట్‌లో పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిపై ఓ కుక్క దాడి చేసింది. బాలుడు ఏడుపు విని కుటుంబీకులు లోపలికి వెళ్లే సరికి బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

ఆస్పత్రికి తరలించే లోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కన్నబిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాలుడి చావుకు కారణమయిన కుక్కను బాలుడి కుటుంబీకులు, తోటి కార్మికులు కొట్టి చంపేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలి

Updated Date - May 15 , 2024 | 06:10 AM

Advertising
Advertising