ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahabubnagar: ఇద్దరిని చిదిమేసిన కలప లారీ!

ABN, Publish Date - Jun 15 , 2024 | 06:03 AM

కలప లోడుతో వెళుతున్న ఓ లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దుర్మరణం చెందారు. మృతు శకటంలా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. రోడ్డుపక్కన టీ తాగుతున్న వారిపై బోల్తా పడటంతో ఈ ఘోరం జరిగింది

  • రోడ్డు పక్కన టీ తాగుతుండగా అదుపు తప్పి వారిపై బోల్తా

  • మానుకోట జిల్లా గూడూరులో ఘోరం

  • మరో ఘటనలో ఇద్దరు కూలీల మృతి

గూడూరు, (మహబూబాబాద్‌ జిల్లా)/అశ్వారావుపేట రూరల్‌, జూన్‌ 14: కలప లోడుతో వెళుతున్న ఓ లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దుర్మరణం చెందారు. మృతు శకటంలా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. రోడ్డుపక్కన టీ తాగుతున్న వారిపై బోల్తా పడటంతో ఈ ఘోరం జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి జామాయిల్‌ కలప లోడుతో ఓ లారీ మహబూబాబాద్‌ మీదుగా బలార్షాకు వెళుతోంది. గూడూరు మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో మూలమలుపు వద్ద అతివేగం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో రోడ్డు పక్క టీ తాగుతున్న గూడూరు మండలం మట్టేవాడ శివారు కొంగరిగిద్దకు చెందిన ధనసరి పాపారావు(35), మచ్చర్లకు చెందిన చుంచా దేవేందర్‌(34)లపై కలప దుంగలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. పాపారావు గూడూరు సీఐ గన్‌మెన్‌గా, దేవేందర్‌ ములుగు జిల్లా రాయినిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల సీఆర్టీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ..

మరో ఘటనలో ట్రాక్టర్‌ను లారీ ఢీకొనగా ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో 14 మందికి గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుమ్మడివల్లికి చెందిన కూలీలు శుక్రవారం సాయంత్రం అశ్వారావుపేటలోని ఓ నర్సరీ నుంచి నారంవారిగూడెంలోని మరో నర్సరీకి మామిడి మొక్కలను ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్నారు. అయితే నారంవారిగూడెం కాలనీ సమీపానికి ట్రాక్టర్‌ చేరగానే ఖమ్మం వైపు వెళుతున్న లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌ బోల్తాపడి కూలీలు రోడ్డు ప్రక్కన చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదంలో వంటెపులి వెంకటలక్ష్మి(35) అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన బత్తుల దుర్గయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Updated Date - Jun 15 , 2024 | 06:03 AM

Advertising
Advertising