ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఓటేసి వస్తూ మృత్యుఒడిలోకి..

ABN, Publish Date - May 16 , 2024 | 04:34 AM

ఎన్నికల ప్రభావంతో విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిలో వాహన రద్దీ బుధవారం కూడా కొనసాగింది. జాతీయ రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఓ ఘటనలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని స్వస్థలానికి వెళ్లిన ఓ యువకుడు తిరుగుప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి బలైపోయాడు. విజయవాడ-హైదరాబాద్‌ హైవేలోని పంతంగి టోల్‌గేటు సమీపంలో ఆగి ఉన్న కంటెయినర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో కొనికల దీపక్‌ రాజ్‌ (29) అనే యువకుడు బుధవారం మరణించాడు.

  • పంతంగి టోల్‌ గేట్‌ వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొట్టిన బైక్‌

  • ఏపీలో రాజమండ్రికి చెందిన యువకుడి మృతి

  • నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో ఐదు కార్లు ఢీ

  • మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

  • 8విజయవాడ- హైదరాబాద్‌

  • హైవేలో వేర్వేరు ఘటనలు

చౌటుప్పల్‌ రూరల్‌, చిట్యాల రూరల్‌, మే 15: ఎన్నికల ప్రభావంతో విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిలో వాహన రద్దీ బుధవారం కూడా కొనసాగింది. జాతీయ రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఓ ఘటనలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని స్వస్థలానికి వెళ్లిన ఓ యువకుడు తిరుగుప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి బలైపోయాడు. విజయవాడ-హైదరాబాద్‌ హైవేలోని పంతంగి టోల్‌గేటు సమీపంలో ఆగి ఉన్న కంటెయినర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో కొనికల దీపక్‌ రాజ్‌ (29) అనే యువకుడు బుధవారం మరణించాడు. చౌటుప్పల్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని రాజమండ్రికి చెందిన కొనికల దీపక్‌ రాజ్‌, అనిరుద్‌ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసముంటున్నారు.


ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలానికి వెళ్లిన వీరిద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, పంతంగి టోల్‌గేటు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ కంటెయినర్‌ లారీని ప్రమాదవసాత్తు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దీపక్‌రాజ్‌ మరణించగా అనిరుద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఘటనలో, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ-హైదరాబాద్‌ హైవేలో వెళుతున్న ఐదు కార్లు ఒక దానిని మరొకటి వెనుక నుంచి ఢీకొన్నాయి. ఓ కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయగా అదే వరుసలో వెనుక వస్తున్న మరో నాలుగు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. కార్ల ముందు, వెనుక భాగాలు దెబ్బతిన్నాయి. కానీ, ఆయా వాహనదారులు రహదారిపై వాగ్వాదానికి దిగడంతో బుధవారం మధ్యాహ్నం మూడు కిలోమీటర్ల మేర వాహనాలు అరగంటకు పైగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన కార్లను పక్కకు తరలించిన తర్వాత వాహన రాకపోకలు కొనసాగాయి.

Updated Date - May 16 , 2024 | 04:34 AM

Advertising
Advertising