ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

ABN, Publish Date - Jan 24 , 2024 | 09:37 AM

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

హైదరాబాద్: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ డీజీ సీజీ ఆనంద్ పర్యవేక్షణలో కేసు విచారణ జరగనుంది. కాగా గొర్రెల స్కామ్‌ విషయంలో గచ్చిబౌలిలో నమోదైన కేసును పోలీస్ అధికారులు ఏసీబీకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి హైకోర్టును ఆశ్రయించారు. గొర్రెల స్కామ్‌పై నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ కేశవ సాయికి హైకోర్టులో ప్రతికూల తీర్పు వెలువడింది. కేసు విచారణ దశలో ఉండగా జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున స్కామ్ జరిగిందనే ఆరోపణలు కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది.

Updated Date - Jan 24 , 2024 | 09:42 AM

Advertising
Advertising