సరిహద్దుల్లో హై అలర్ట్
ABN, Publish Date - Apr 21 , 2024 | 10:28 PM
హారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్ సంఘటన, పార్లమెంట్ ఎన్ని కల నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రక టించారు. తీరం వెంట నిరంతర నిఘాను ఏర్పాటు చేసిన పోలీసులు సరిహద్దు ప్రాంతాన్ని తమ ఆధీనం లోకి తెచ్చుకుని ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలను సమీక్షిస్తున్నారు.
కోటపల్లి, ఏప్రిల్ 21: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్ సంఘటన, పార్లమెంట్ ఎన్ని కల నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రక టించారు. తీరం వెంట నిరంతర నిఘాను ఏర్పాటు చేసిన పోలీసులు సరిహద్దు ప్రాంతాన్ని తమ ఆధీనం లోకి తెచ్చుకుని ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలను సమీక్షిస్తున్నారు. ఇటీవల బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో 29 మంది మావోయిస్టులు మృతి చెందడంతోపాటు పలువురి కి గాయాలయ్యాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రోజుకో ఘటన జరుగుతుండడంతో మావోయి స్టులు తెలంగాణలోకి చొరబడే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సరిహద్దు పోలీస్‌స్టేషన్ లలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లా సరిహ ద్దుల్లోని ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు అడవుల్లో ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి. రామగుండం సీపీతోపాటు మంచిర్యాల డీసీపీ, జైపూర్ ఏసీపీ, ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సమీ క్షించి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రతీకార చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్న నేపథ్యంలో వాటిని తిప్పి కొట్టేందుకు చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్‌ఐ రాజేందర్‌లతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు తీరం వెంట నిత్యం తనిఖీలు చేపడుతున్నారు.
-డ్రోన్‌లతో నిరంతర నిఘా...
సరిహద్దు తీరం వెంట డ్రోన్ల సహాయంతో పోలీసులు నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సరిహద్దు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు వాటితో పాటు అధునాతన సాంకేతికత కలిగిన డ్రోన్‌ల ఆధారంగా మావోయిస్టుల కదలికలపై కన్నేశారు. మరో వైపు పక్క రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావే శాలు ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాల అధికారుల సమన్వ యంతో ముందుకు వెళ్తున్నారు.
-ముమ్మరంగా తనిఖీలు
కోటపల్లి మండలంలోని 63వ నెంబరు జాతీయ రహ దారిపై రాపన్‌పల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలో 24 గంటల పాటు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను లోబర్చుకునేందుకు మద్యం, డబ్బులు ఇతర సామగ్రి రాకుండా చూడడంతో పాటు అనుమాని త వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. గోదావరి, ప్రాణహిత నదుల మార్గాల్లోని పడవల యజమానులు, మత్స్య కార్మికులతో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులు చొరబడితే తమకు సమా చారం అందించాలని కోరారు. సరిహద్దు తీర ప్రాంత గ్రామాల్లో ఇండ్లలోను తనిఖీలు చేస్తున్న పోలీసులు గ్రా మాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని రాబడుతు న్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగిం చుకోవాలని, ప్రజలు సహకారం అందించాలని కోరారు. పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో సరిహద్దులపై హై అలెర్ట్ ప్రకటించగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Apr 21 , 2024 | 10:28 PM