ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

ABN, Publish Date - Jul 22 , 2024 | 10:54 PM

సమస్యలు పరిష్కరిం చాలని తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్‌ (సీఐటీయు) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయా లని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందించారు.

నస్పూర్‌, జూలై 22: సమస్యలు పరిష్కరిం చాలని తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్‌ (సీఐటీయు) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయా లని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందించారు. అంతకు ముందుగా చౌరస్తా నుంచి ఊరేగింపుగా కలెక్టరేట్‌కు వచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బైఠాయించారు. నాయకులు మాట్లాడుతూ కనీసం వేతనం 18వేలు, అల వెన్స్‌లను ప్రకటించాలన్నారు. ఆశాలకు ప్రభు త్వం నిర్వహించ తలపెట్టిన పరీక్షలను ఉపసం హరించుకోవాలన్నారు. సెలవులు లేకుండా ఉద యం నుంచి రాత్రి వరకు సేవలు చేయాల్సి వస్తోందన్నారు. ధర్నాలో శోభ, రంజిత్‌ కుమార్‌, పద్మ, సువర్ణ, సుజాత, కవిత, అరుంధతి, విజయలక్ష్మి, సునిత, భాగ్య పాల్గొన్నారు.

హాజీపూర్‌: బీసీ కుల గణన చేపట్టాలని బీజే పీ నాయకులు తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. నాయకులు మాట్లా డుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ కుల గణన చేపడుతా మని, స్ధానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్‌లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. వెంటనే బీసీ కుల గణన చేపట్టి, స్ధానిక సంస్థల్లో బీసీల కు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు మంజూరు చేయాలన్నారు. చిందం రమేష్‌, సత్యం, కృష్ణమూర్తి, శంకర్‌ పాల్గొన్నారు.

బెల్లంపల్లి(తాండూర్‌): ఐబీ చౌరస్తాలో అం బేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించా లని నేతకాని సంఘం నాయకులు తహసీ ల్దార్‌కు వినతిపత్రం అందించారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకుస్థలం కేటాయించాలన్నారు.

భీమారం: ఆరేపల్లి ఎర్ర చెరువు నుంచి ఆరేపల్లి, మద్దికల్‌ గ్రామాల రైతులు కాలువలు ఏర్పాటు చేయాలని మండల స్పెషల్‌ ఆఫీసర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు అందజేశారు. కాలువల ద్వారా నీరందిస్తే పంటలకు ఇబ్బంది ఉండదని తెలిపారు.

Updated Date - Jul 22 , 2024 | 10:54 PM

Advertising
Advertising
<