కళాయాత్ర ముగింపు పోస్టర్ల ఆవిష్కరణ
ABN, Publish Date - Jun 04 , 2024 | 10:58 PM
జిల్లాకు చెందిన పెయింటింగ్ కళా కారుడు వేల్పుల పోశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటిస్తూ లైవ్ పెయింటింగ్‌లు వేస్తూ సాగుతున్న కళాయాత్ర ముగింపు పోస్టర్లను మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్, ఫిట్‌నెస్ సభ్యులు ఆవిష్కరించారు.
ఏసీసీ, జూన్ 4: జిల్లాకు చెందిన పెయింటింగ్ కళా కారుడు వేల్పుల పోశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటిస్తూ లైవ్ పెయింటింగ్‌లు వేస్తూ సాగుతున్న కళాయాత్ర ముగింపు పోస్టర్లను మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్, ఫిట్‌నెస్ సభ్యులు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 7న తమిళనాడులోని కన్యాకుమారి వివేకానంద రాక్ మోమోరియల్‌లో కళాయాత్ర ముగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2017 నుంచి దాదాపు 8 ఏండ్లుగా దేశమంతా పర్యటిస్తూ లైవ్ పెయిం టింగ్‌లు గీస్తూ జిల్లా కళాకారుడు పోశం ప్రపంచం దృష్టిని ఆకర్షించాడన్నారు. లండన్ బుక్ ఆఫ్ రికార్స్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు, గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డులు పోశం సొంతమయ్యాయన్నారు. దేశ వ్యాప్తంగా 30,700 కిలోమీటర్లు తిరిగాడాన్నారు. సంస్కృతి, సంప్రదాయాలపై దాదాపు 25 వేల పెయింటింగ్‌లు గీశాడన్నారు. తెలంగాణ టీచర్స్ యూనియన్ నాయకులు, ఫిట్‌నెస్ సెంటర్, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2024 | 10:58 PM