Kumaram Bheem Asifabad: సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్
ABN, Publish Date - Nov 13 , 2024 | 10:34 PM
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 13(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం చేప ట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వేను పక డ్బందీగా చేపట్టాలని కలె క్టర్ వెంకటేష్‌దోత్రే అన్నా రు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 13(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం చేప ట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వేను పక డ్బందీగా చేపట్టాలని కలె క్టర్ వెంకటేష్‌దోత్రే అన్నా రు. బుధవారం జిల్లాలో ని ఆసిఫాబాద్ మున్సి పల్ పరిధిలోని జన్కాపూ ర్‌వార్డు మేకలవాడలో కొనసాగుతున్నసర్వేను మున్సిపల్‌కమిషనర్ భుజంగరావు తోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేసిబ్బంది ప్రతిఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల వివరాలను సేకరించాలన్నారు. నిర్ణీతనమునా లో పొందుపరిచిన ప్రతిఅంశాన్ని తప్పనిసరిగా పూరించాలని తెలిపారు. సర్వే చేపట్టే ముందురోజు ఇళ్లయజమానులకు ముందస్తు సమాచారం అందించి అవసరమైన పత్రాలతో సిద్ధంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివరాల సేకరణలో సర్వేసిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయకూడదన్నారు. వివరాలను స్పష్టంగా నమోదుచేయాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి..
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోగల వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని జన్కాపూర్ వార్డు మేకలవాడలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని వార్డులలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. మురుగు కాలువల్లో పూడికతీత ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. వార్డులలో అంతర్గత రహదారులపై చెత్తచెదారం లేకుండాశుభ్రంగా ఉంచాలనితెలిపారు. ఈక్రమంలో వాడలోని కిరాణదుకాణం ముందు ఉన్న చెత్తచెదారాన్ని పరిశీలించి సంబంధిత దుకాణం యజమానికి జరిమానా విదించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఆయనవెంట మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, తదితరులు ఉన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 10:34 PM