ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఆందోళనలో.. పత్తి రైతు

ABN, Publish Date - Nov 04 , 2024 | 10:52 PM

పత్తి సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. పత్తి ఏరివేతకు చేలు సిద్ధంగా ఉండగా ఇప్పటివరకు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.

- తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు

- కూలీలు దొరక్క ఏరివేత కష్టాలు

- అకాల వర్షాల భయం

పత్తి సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. పత్తి ఏరివేతకు చేలు సిద్ధంగా ఉండగా ఇప్పటివరకు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కూలీల కొరత కూడా తీవ్రంగా వేధి స్తోంది. మరోవైపు ఎక్కడ వర్షాలు కురిసి పత్తి ఏరడానికి వీలు కాకుండా పోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. - వాంకిడి

నాలుగేళ్ల క్రితం వరకు పత్తి ఎకరానికి 10నుంచి 15 క్వింటాళ్ల వరకు డిగుబడి వచ్చేది. ఆ తర్వాత 8నుంచి10 క్వింటాళ్ల వరకు పరిమితమవగా రెండేళ్ల నుంచి 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు డిగుబడి వస్తోంది. ఈ ఏడాది అధిక వర్షా లతో పత్తిదెబ్బతిని 5క్వింటాళ్ల లోపే దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, తెగుళ్లకారణంగా దిగు బడులు గణనీయంగా తగ్గాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు పెట్టుబడులు ఆకాశాన్ని తాకగా, దిగుబడులు నేలచూపు చూస్తున్నాయని పేర్కొంటున్నారు.

- కూలీలు దొరక్క కష్టాలు

వర్షాలు, చీడపీడలను ఎదుర్కొని పత్తి పండించిన రైతుకు ఏరివేత కష్టాలు మొదలయ్యాయి. కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏరిన పత్తిని అమ్ముదామంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించ లేదు. దీంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధర తగ్గించడంతో పెట్టు బడులు కూడా రావడం లేదని రైతులు దిగాలు చెందుతు న్నారు. పత్తి ఏరివేతకు కిలోకు రూ.10నుంచి12 ఇస్తేనే వస్తామని కూలీలు స్పష్టం చేస్తున్నారు. పైగా కూలీలను తీసుకెళ్లేందుకు ఆటో, మధ్యాహ్నం శీతల పానీయాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇతర గ్రామాల నుంచి వచ్చిన కూలీలకు ఉండడానికి వసతి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. అందరూ ఒకేసారి పత్తి ఏరుతుండడడంతో కూలీల కొరత ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు.

- ధర తగ్గించి కొనుగోలు..

ఎక్కువ కూలీ చెల్లించి పత్తి సేకరించినా సీసీఐ కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులకు అమ్మకం కష్టాలు మొదల య్యాయి. ప్రభుత్వం ఈ సారి పత్తికి క్వింటాకు మద్దతు ధర రూ.7,521 చెళ్లిస్తామని ప్రకటించింది. సీసీఐ కొనుగోలు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారులు సిండికేట్‌గా మారి రూ.6,200కు కొనుగోలు చేస్తున్నారు. దిక్కు తోచని స్థితిలో రైతులు ప్రైవేట్‌ వ్యాపారస్థులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాక తేమ, నాణ్యత లేదని కోతలు విధిస్తూ తూకంలో మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- నష్టాలే మిగులుతున్నాయి

- గుర్నులే మెంగాజీ, రైతు, కోమటిగూడ

నేను 12ఎకరాల్లో పత్తి సాగుచేశాను. ఎకరాకు రూ.35 నుంచి రూ.40వేల దాక ఖర్చయింది. దిగుబడి ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్లే వచ్చింది. ఈ ఏడాది అధికవర్షాలు, ఆకుముడత, లద్దె పురుగుతో పత్తిపంట దెబ్బతింది. పత్తి ఏరివేతకు కూలీలు కొరతఏర్పడింది. కిలోకు రూ.10 ఇస్తా మన్నా కూలీలు దొరకలేదు. ఇటు వ్యాపారులు క్వింటాకు మద్దతు ధరకంటే తక్కువగా కొంటున్నారు. ఈసారి రైతులకు ఏమీ మిగిలే పరిస్థితులు లేవు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిస్తే రైతులకు కొంత ఊరట లభిస్తుంది.

Updated Date - Nov 04 , 2024 | 10:52 PM