ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఘనంగా ప్రజాపాలన విజయోత్సవం

ABN, Publish Date - Nov 23 , 2024 | 10:31 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే నెల7వరకు నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్‌లో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధ్యక్షతన 80మంది కళాకారులతో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక అందరినీ ఆకట్టుకుంది.

- కళాకారుల ఆటపాట

- అభివృద్ధిని ఆవిష్కరించిన కలెక్టర్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే నెల7వరకు నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్‌లో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధ్యక్షతన 80మంది కళాకారులతో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక అందరినీ ఆకట్టుకుంది. సంవత్సరకాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. డీపీఆర్వో సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు చేసిన నృత్యాలు, పాడినపాటలు అందరినీ అలరించాయి. కళాకారులు వివిధ రకాల వేషాదారణలతో కనిపించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలు తీరును పాటలు, కథలు, నృత్యాల రూపంలో కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో జిల్లాలో 54లక్షల మంది మహిళలు ఉచితబస్సు సౌకర్యం వినియోగించుకన్నా రని తెలిపారు. గృహజ్యోతి పథకంలో 72వేల జీరో బిల్లులు ఇచ్చినట్లు తెలిపారు. రైతు రుణమాఫీలో భాగంగా 48వేల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రజాపాలనలో భాగంగా జిల్లాలోని అర్జీదారుల వద్ద నుంచి 1.45లక్షల అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ద్వారా 75 వేలమంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. గడిచిన 11నెలల్లో జిల్లాలో 129నర్సు పోస్టులు, 275ఉపాధ్యాయ పోస్టులు, 151 కానిస్టేబుల్‌, 78గ్రూపు-4 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, జిల్లా కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 10:31 PM