ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: జిల్లాలోకి యథేచ్ఛగా.. దేశీదారు

ABN, Publish Date - Nov 10 , 2024 | 10:51 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర కేంద్రంగా దేశీదారు దందా కొనసాగుతోంది.

- రైళ్ల ద్వారా అక్రమ రవాణా

- స్థానిక మద్యం విక్రయాలపై ప్రభావం

- దృష్టిసారించిన ఎక్సైజ్‌ అధికారులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర కేంద్రంగా దేశీదారు దందా కొనసాగుతోంది. మహారాష్ట్రకు సరిహద్దునే ఉన్న ఆసిఫాబాద్‌ జిల్లాలోని చాలాగ్రామాల్లో ప్రస్తుతం మహారాష్ట్ర దేశీ మద్యాన్ని తరలించి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ తయారు చేస్తున్న దేశీదారు ధర తక్కువగా ఉండటం అధిక మత్తు ఇస్తుండటంతో ఈ దందాకు డిమాండు పెరిగింది. రెండేళ్ల క్రితం వరకు మహారాష్ట్రలో ఇక్కడి వ్యాపారులు ఆడిందే ఆటగా అమ్మిందే మందుగా సాగింది. మహారాష్ట్రలో మద్యపాన నిషేధం ఎత్తివేయటంతో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. మహారాష్ట్రలో లభించే దేశీదారు కారుచౌకగా లభించటంతో ఈ ప్రాంతానికి ఆసిఫాబాద్‌, సిర్పూరు మార్గాల గుండా తరలిస్తున్నారు. రోడ్డుమార్గంతోపాటు రైళ్లగుండా తరలించి జిల్లాలో అమ్ముతున్నారు. దీంతో కొంత కాలంగా జిల్లా ఎక్సైజ్‌ యంత్రాంగం దేశీదారుపై దృష్టిసారించింది. స్మగ్లింగ్‌ జరుగుతున్న మార్గాలపై గట్టి నిఘాపెట్టింది. అయినప్పటికీ స్మగ్లర్లు ఎక్సైజ్‌ యంత్రాంగాన్ని బురిడికొట్టించి మరీ జిల్లాలోకి దేశీదారును స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు కనిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్‌శాఖ ప్రతిరోజు ఏదో ఒకచోట దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్ర టాస్క్‌ఫోర్సు ఆధ్వర్యంలో ప్రత్యేకనిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దందాను నిర్వహిస్తున్న కొంతమందిని స్థానిక తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేస్తున్నారు. దేశీదారు స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతూ భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గతేడాది నుంచి జరిగిన దాడుల్లో కొన్నికేసుల్లో ఒక్కొక్కరిపై లక్ష వరకు జరిమానా విధించారు. మహారాష్ట్రలో మద్య నిషేధం పాక్షికంగా సడలించటంతో దానిప్రభావం జిల్లాలోని మద్యం విక్రయాలపై పడినట్టు ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. దేశీదారు దందాను అరికట్టేందుకు ఎక్సైజ్‌ అధికారులు గ్రామాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. దేశీదారుతో వచ్చే అనార్థాలను వివరిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మహారాష్ట్ర నుంచి కౌటాల వైపు ఆటోలో తరలిస్తున్న 20పెట్టెల దేశీదారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ.1.80లక్ష ఉండగా, ఈ కేసులో ముగ్గురిని అరెస్టుచేశారు. అలాగే కాగజ్‌నగర్‌ పట్టణంలో గతనెల మొదటివారంలో దేశీదారు అమ్మకాలు చేస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు ఒకరి ఇంటిపై దాడులు చేసి దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గతంలో ఈ దందాకు పాల్పడిన వారిపై గట్టి నిఘా పెట్టి దేశీదారు జిల్లాలోకి రాకుండా చేస్తున్నారు.

దాడులు చేస్తున్నాం..

-రవి కుమార్‌, ఎక్సైజ్‌ సీఐ కాగజ్‌నగర్‌

మహారాష్ట్రలో మద్య నిషేదం ఎత్తివేసినందున దేశీదారు దందా పెరిగింది. ఈ దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి మద్యం ప్రవేశించకుండా గట్టి నిఘా పెడుతున్నాం. ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నాం. ఈ దందాను గతంలో నిర్వహించిన వారిపై నిఘా పెట్టి బైండోవర్‌ చేస్తున్నాం.

Updated Date - Nov 10 , 2024 | 10:51 PM