ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:07 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కాగజ్‌ నగర్‌ మున్సిపల్‌అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని అద నపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కాగజ్‌ నగర్‌ మున్సిపల్‌అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని అద నపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ అమృత్‌2.0కింద ఎంపికైనందున మున్సిపల్‌ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కాగజ్‌నగర్‌మున్సిపాలిటీ అమృత్‌ 2.0 ఫిదా ఎంపికైనందున మున్సిపాలిటీలో ప్రస్తుతం కొనసాగు తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి పనులతోపాటు వచ్చే 20సంవత్సరాల కొరకు చేపట్టే అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో జీఏఎస్‌ డ్రోన్‌ద్వారా మున్సిపాలిటీని చిత్రిస్తా మని అన్నారు. పదిసంవత్సరాలలో పట్టణవివరాలు, వచ్చే20 సంవత్సరాల నాటికి ప్రజలకు అవసరమైన వాటిని గుర్తించి ప్రణాళికలను శాఖలవారీగా ఈనెల31లోగా మున్సిపల్‌ కమిషనర్‌కు అందించాలని తెలిపారు. మున్సిపల్‌ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్లాట్లను పరిశీలన..

కెరమెరి: మండలంలోని హట్టిగ్రామ సమీ పంలో కెరమెరికి చెందిన పలువురు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దర ఖాస్తు చేసుకోగా బుధవారం స్థలాన్ని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీతహసీల్దార్‌ నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశిం చారు. అనంతరం కెరమెరి జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ నిర్మిస్తున్న మరుగుదొడ్లను, మూత్రశా లలను పరిశీలించి పనులు నాణ్యతగా చేపట్టాలని అధికారు లను ఆదేశించారు. అనంతరం ఎన్‌ఏఎస్‌ సర్వే వివరాలను విద్యార్థుల వారీగా పొందుపరిచి వారాంతపు పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం ఎస్సీకాలనీలోని ఐసీడీఎస్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడజరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వంట గది నిర్మించాలని అంగన్‌వాడీ టీచర్‌ అదనపు కలెక్టర్‌కు దృష్టికి తీసుకువచ్చారు. ఆయనవెంట ఎంపీడీవో అంజద్‌పాషా, ఎంఈవో ప్రకాష్‌, డీటీ సంతోష్‌, ఏఈ నజ్మోద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:07 PM