Kumaram Bheem Asifabad: ఈఎస్‌ఐ ఆసుపత్రిని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్స్ బృందం
ABN, Publish Date - Dec 06 , 2024 | 10:41 PM
కాగజ్‌నగర్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ ఈ ఎస్‌ఐ ఆసుపత్రిని కేంద్ర ఈఎ స్‌ఐ ఆసుపత్రుల డిప్యూటీ డైరెక్టర్స్ బృంద సభ్యులు శుక్రవారం పరిశీలించారు.
కాగజ్‌నగర్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ ఈ ఎస్‌ఐ ఆసుపత్రిని కేంద్ర ఈఎ స్‌ఐ ఆసుపత్రుల డిప్యూటీ డైరెక్టర్స్ బృంద సభ్యులు శుక్రవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన ఈఎస్‌ఐ భవనంపై అధ్య యనం చేశారు. వర్షాకాలంలో భవన స్థితిగతులపై వివరాలు సేకరించారు. అలాగే డిస్పెన్సరీని కూడా పరిశీలించారు. పట్టణంలోని పలుభవనాలను కూడా పరిశీంచారు. ఈ సందర్భంగా బృందసభ్యులు మాట్లాడుతూ ఈఎస్‌ఐ భవనం మార్చటమా..? లేక నూతన భవనం నిర్మించటమా..? అనేఅంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నివేదికను నేరుగా కేంద్ర ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు పంపించనున్నట్టు తెలిపారు. బృందంలో డిప్యూటీ డైరెక్టర్స్ రణధీర్, వేద ప్రకాష్, మహేష్, జూనియర్‌ఇంజనీర్ రామయ్య, ఈఎస్‌ఐ డాక్టర్ జగన్, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Dec 06 , 2024 | 10:41 PM