Kumaram Bheem Asifabad: బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: తుడుందెబ్బ
ABN, Publish Date - Nov 07 , 2024 | 10:25 PM
వాంకిడి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వాంకిడి గిరి జన ఆశ్రమపాఠశాలలో విద్యార్థినుల అనారోగ్యానికి కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ నాయకులు మండలకేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టారు.
వాంకిడి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వాంకిడి గిరి జన ఆశ్రమపాఠశాలలో విద్యార్థినుల అనారోగ్యానికి కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ నాయకులు మండలకేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధానకార్య దర్శి కోట్నాక విజయ్ మాట్లా డుతూ వారంరోజుల నుంచి విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నా ఉన్నతాధికారులు ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకర మన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ విద్యా ర్థినులకు ఏదైనాజరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆశ్రమపాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినులు అస్వస్థతకుగురైతే ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారపదార్థాల వల్ల అస్వస్థతకు గురైనట్లు అధికారులు, సిబ్బంది పేర్కొనడం ఏమిటని ప్రశ్నించారు. బాధ్యులపైచర్యలు తీసుకోకపోతే పెద్దఎ త్తున ఆందోళనచేపడుతామన్నారు. కార్యక్రమంలో నాయ కులు రాము, రాంషా, రాజు, భీంరావు పాల్గొన్నారు
Updated Date - Nov 07 , 2024 | 10:25 PM