ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: విద్యార్థినులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనం పెట్టాలి

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:03 PM

వాంకిడి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి అన్నిసదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

- సరుకులు, వంటకాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి

- వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి

- గిరిజన సంక్షేమశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి

వాంకిడి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి అన్నిసదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి అన్నారు. వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమపాఠశాలలో ఇటీవల అస్వస్థతకు గురైన శైలజ అనే విద్యార్థిని మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం పాఠశాలను సందర్శిం చారు. పాఠశాలలో భోజనం, మంచి నీరు, వంటశాల, తరగతిగదులు, డార్మెట్రీని, మౌళిక సదు పాయాలను పరిశీలించారు. విద్యార్థిను లతోకలిసి భోజనం చేశారు. గతనెల 30న విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘట నపై విద్యార్థినులను, ఉపాధ్యాయులను, వర్కర్లను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు విద్యార్థినులను పరామర్శించి ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్‌ని అడిగితెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థినులతో ఫుడ్‌కమిటీ, శానిటేషన్‌ కమిటీ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తున్న వంటకా లను పరిశీలించాలని విద్యార్థినులకు సూచించారు. ఏ రోజు ఏఏ కూరగాయాలు ఇస్తున్నారు, ఉదయం అంది స్తున్న అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి అందిస్తున్న భోజన వివరాలను ప్రతిరోజు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. వంటకాల్లో అన్నం ఉడకకపోయినా, కుళ్లిన కూరగాయలు తీసుకువచ్చినా వార్డెన్‌ను, హెచ్‌ఎంను ప్రశ్నించాలని విద్యార్థినులకు సూచించారు. పాఠశాలలో 571మంది విద్యార్థినులకు సరిపడ సదుపాయాలు లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. పాఠశాలలోని బాత్‌రూమ్‌ నీళ్లు బయటికి వెళ్లడానికి నిర్మించిన డ్రెయినేజీలో చెత్త నిండి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు అవసరమైన అదనపుగదులు, డైనింగ్‌హాల్‌, మరుగుదొడ్లు, సైడ్‌డ్రైన్‌ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని వెంటనే ప్రతిపాదనలు పంపించాలని డీటీడీవో రమాదేవి, ఐటీడీఏ ఏఈ నిజామోద్దిన్‌ను ఆదేశించారు. ఇంజ నీరింగ్‌ అధికారులు సైతం పాఠశాలను సందర్శిస్తూ అవసరం ఉన్నవాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని అన్నారు. విద్యార్థినులు బయటి నుంచి ఆహారపదార్థాలను తీసుకువచ్చి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదరయ్యే అవకాశాలు ఉన్నాయని, ఎవరూ బయటి ఆహారపదార్థాలను తినవద్దని పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్నిచర్యలు తీసుకుకోవాలని డీటీడీవోను ఆదేశించారు.

ఫ పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి..

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిం చాలని ఇన్‌చార్జీ హెచ్‌ఎం నారాయణమూర్తిని ఆదేశిం చారు. పాఠశాలలో 571మంది విద్యార్థినులకుగాను ప్రస్తుతం 320మంది ఉన్నారని మిగితా విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేకతరగతులు నిర్వహించి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు, క్రీడలు, వ్యాయామం ఎంతైనా అవసరమని ఆ దిశగా విద్యార్థు లను సన్నద్ధం చేయాలన్నారు. ఆయన వెంట డీటీడీవో రమాదేవి, తహసీల్దార్‌ రియాజ్‌ అలీ, గిర్దావార్‌ మాజీద్‌ ఉన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:03 PM