Kumaram Bheem Asifabad: అందరికీ ఆదర్శం మౌలానా అబుల్ కలాం: కలెక్టర్
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:35 PM
ఆసిఫాబాద్, నవంబరు 11(ఆంద్రజ్యోతి): భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 11(ఆంద్రజ్యోతి): భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం అబుల్ కలాం జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వేడుకకు అదనపు కలెక్టర్ దీపక్‌తివారితోకలిసి హాజరై జ్యోతిప్రజ్వ లన చేశారు. ఆజాద్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ భారతదేశ తొలివిద్యాశాఖ మంత్రిగా ఎన్నో వినూత్నసంస్కరణలతో విశిష్టసేవలు అందించారని అన్నారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషిచేశారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి రమాదేవి, జిల్లాపంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్, ఎస్సీ అభివృద్ధి అధికారి సజీవన్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడలతోపాటు చదువులో రాణించాలి..
విద్యార్థులు క్రీడలతోపాటు చదువులో రాణించాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో క్రీడాపోటీల్లో గెలిచిన విద్యార్థులను అదనపుకలెక్టర్ దీపక్‌తివారితో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొం దించుకొని ఏకాగ్రతతో చదువులోనూ రాణించాలన్నారు. ఈనెల6,7,8వతేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన సంక్షేమ బాలికల క్రీడాపోటీల్లో జిల్లాకేంద్రంలోని గిరిజనసంక్షేమ క్రీడాపాఠశాలకుచెందిన అండర్-14,-17సంవత్సరాల వయస్సుగల విద్యార్థినులు ఓవరాల్ చాంపియన్ షిప్, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన హ్యాండ్ బాల్‌పోటీలు, ఉట్నూర్‌లో నిర్వహించిన ఖోఖోపోటీల్లో పాల్గొని బంగారు పథకాలు సాదించారని తెలిపారు. విద్యార్థులు క్రీడలతోపాటు విద్యలో రాణించాలని, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గిరిజనాభివృద్ధి అదికారి రమాదేవి, గిరిజన సంక్షేమ క్రీడాధికారి మీనారెడ్డి, ఏసీడబ్ల్యూఓ ఉద్దవ్, ప్రధానోపాధ్యాయుడు జంగు, శిక్షకులు విద్యాసాగర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 11 , 2024 | 10:35 PM