ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: గ్రూపు-3 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

ABN, Publish Date - Nov 13 , 2024 | 10:38 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈనెల17,18తేదీల్లో జరుగ నున్న గ్రూపు-3పరీక్షకు పూర్తిఏర్పాట్లు చేయా లని రాష్ట్రపబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌చైర్మన్‌ మహేం దర్‌రెడ్డి అన్నారు.

- రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈనెల17,18తేదీల్లో జరుగ నున్న గ్రూపు-3పరీక్షకు పూర్తిఏర్పాట్లు చేయా లని రాష్ట్రపబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌చైర్మన్‌ మహేం దర్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అన్నిజిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, ఎస్పీలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పరీక్ష నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే మాట్లాడుతూ గ్రూపు-3 పరీక్షకు జిల్లాలో పూర్తిఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 18పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశా మని, జిల్లాలో 4471మంది అభ్యర్థులు పరీ క్షకు హాజరవుతున్నారని అన్నారు. ఈ క్రమం లో పరీక్షాకేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యా కెట్లు, విద్యుత్‌, వైద్యసిబ్బంది తదితర అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలు చేస్తామని అన్నారు. సమీప జిరాక్స్‌ సెంటర్లు మూసి వేస్తామన్నారు. స్ట్రాంగ్‌రూంనుంచి పోలీసు బందోబస్తు మధ్య ప్రశ్నాపత్రాల తరలింపు, పరీక్షా కేంద్రాల్లోకి చీఫ్‌ సూపరింటెండెంట్‌ తప్ప వేరే ఎవరికి మొబైల్‌ అనుమతి లేదని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త లక్ష్మినర్సింహ, రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాల్లో పూర్తివసతులు కల్పించాలి..

ఆసిఫాబాద్‌రూరల్‌: గ్రూపు-3 పరీక్షకు జిల్లాలో ఏర్పాటుచేసిన పరీక్షకేంద్రాల్లో పూర్తి వసతులు కల్పించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లాపరిషత్‌ బాలికల, బాలుర పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పరీక్షకేంద్రాలను ఆకస్మి కంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రూపు-3పరీక్షకు పరీక్ష కేంద్రం లో అభ్యర్థులకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకె ట్లు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉంచాల న్నారు. పరీక్షకు అవసరమైన ఫర్నీచర్‌, వెలు తురు, ఫ్యాన్లు ఏర్పాటుచేయాలని, ప్రహరీకి ఆనుకుని ఉన్నగదుల కిటికీలను మూసిఉంచా లని, విద్యుత్‌లో ఎలాంటిఅంతరాయం లేకుం డా సరఫరాజరిగేలా ప్రత్యేకదృష్టి సారించా లని తెలిపారు. అవసరమైన పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయన వెంట పరీక్షల ప్రాంతీ యసమన్వయకర్త లక్ష్మినర్సింహ, ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 10:38 PM