ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలి: ఎస్పీ

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:03 PM

చింతలమానేపల్లి/ సిర్పూర్‌(టి), నవంబరు 6: ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవా లని ఎస్పీ డీవీశ్రీనివాస రావు అన్నారు.

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

చింతలమానేపల్లి/ సిర్పూర్‌(టి), నవంబరు 6: ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవా లని ఎస్పీ డీవీశ్రీనివాస రావు అన్నారు. చింతల మానేపల్లి, సిర్పూర్‌(టి) మండల కేంద్రాల్లోని పోలీసుస్టేషన్లను బుధ వారం ఆయన సందర్శిం చారు. ఈసందర్భంగా పోలీసుసిబ్బంది విధులగురించి ఎస్సైని అడిగి తెలుసుకు న్నారు. పోలీసుస్టేషన్‌లో కేసులకు సంబంధించిన ఫైళ్లను, పోలీసుస్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో మర్యాదగా ఉంటూ వారి సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలన్నారు. ప్రజాఫిర్యాదులలో ఎటువంటి జాప్యంచేయకుండా తక్ష ణమే స్పందించాలని సూచించారు. నేరదర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం సద్విని యోగం చేసుకోవాలని, రికార్డులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచా లన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో జిల్లాసరిహద్దు చెక్‌పోస్టులలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం, సీఐ రమేష్‌, ఎస్సై నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:03 PM