Kumaram Bheem Asifabad : సర్వేలో ప్రతి కుటుంబ వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్
ABN, Publish Date - Nov 10 , 2024 | 10:47 PM
ఆసిఫాబాద్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేలో జిల్లాలోని ప్రతి కుటుంబం వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ వెంక టేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేలో జిల్లాలోని ప్రతి కుటుంబం వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ వెంక టేష్ దోత్రే అన్నారు. ఆదివారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం తుంపల్లి గ్రామంలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేతీరును తహసీ ల్దార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా నమోదుచేయాలని తెలిపారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయిం చిన బ్లాక్‌లలో పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యుల వివరాలు నిర్ణీతనమునాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. నిర్దేశించిన ఫారంలో ప్రతిఅంశాన్ని ప్రజలవద్ద నుంచి తప్పనిసరిగా సేకరించాలని, అందు బాటులో లేని వారి ఇంటికి మరోకసారి తప్ప నిసరిగా వెళ్లాలన్నారు. ఒక్క కుటుంబం కూడా మిన హాయింపుకాకూడదని తెలిపారు. సర్వే ముందురోజు ఏప్రాంతంలో సర్వేనిర్వ హి స్తారో సంబంధిత కుటుంబసభ్యులకు సమా చారం అందించాలని, సర్వేలక్ష్యాన్ని సాధించా ల్సిన బాధ్యత ఎన్యూమరేటర్లపై ఉందని తెలి పారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరినీ ఓటరుగా
నమోదు చేయాలి..
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హత గల ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయా లని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ వెంక టే ష్‌దోత్రే అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ మండలం తెంపల్లిలోని ప్రభుత్వప్రాథమిక ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో కొనసాగుతున్న ఓటరునమోదు ప్రత్యేకశిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18సంవత్సరాల వయస్సునిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదుచేయాలని తెలిపారు. భార తఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవ రణలు, తొలగింపునకు ప్రత్యేకశిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 10:47 PM