ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad : ధరణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Nov 20 , 2024 | 10:53 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వివిధరకాల భూసమస్యల పై ధరణి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తు లను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వివిధరకాల భూసమస్యల పై ధరణి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తు లను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవోలోకేశ్వర్‌రావుతో కలిసి ధరణి ధ్రువపత్రా లు, కల్యాణలక్ష్మి పథకంపై తహసీల్దార్‌లతో సమీక్షాసమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో విరాసత్‌, భూవిస్తీర్ణం సవరణ, పేరుసవరణ, నిషేధితజాబితాలో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేకదృష్టి సారించాలని అన్నారు. కార్యాలయ రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నిబంధనలప్రకారం త్వరగా పరిష్కరించాలని తెలిపారు. కోర్టుకేసులు ఉన్నవాటిపై రికార్డులను పూర్తిగా పరిశీలించి నివేదిక అందించాలన్నారు. కుల, ఆదాయ, నివాస, కుటుంబసభ్యుల ధ్రువపత్రాలకు మీసేవ ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారి జాబితాను రూపొందించాలని తెలిపారు.

అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన..

గ్రూపు-4 ద్వారా రెవెన్యూశాఖలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రా లను పరిశీలించాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో 2022లో నిర్వహించిన గ్రూపు-4పరీక్షకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో 39 మంది అభ్యర్థులు రెవెన్యూశాఖలో ఎంపికైనందున వారి ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమానికి కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లాతో కలిసి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంపికైన 30మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనత్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. వారివెంట కలెక్టరేట్‌ ఏవో మధుకర్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 10:53 PM