ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: కలెక్టరేట్‌ ఎదుట వీవోఏల ధర్నా

ABN, Publish Date - Nov 11 , 2024 | 10:33 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వీవోఏ ఉద్యోగులసంఘం ఆధ్వర్యంలో ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

ఆసిఫాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వీవోఏ ఉద్యోగులసంఘం ఆధ్వర్యంలో ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్‌, వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు బుద్దు మాట్లాడుతూ వీవోఏలకు బకాయి ఉన్న స్త్రీనిధి ఇన్సెంటివ్‌ను వెంటనే చెల్లించాలన్నారు. కనీస వేతనం రూ. 20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రూ.20లక్షల బీమా సౌకర్యం కల్పించి ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ, వీవోఏల సంఘాలనాయకులు కృష్ణమాచారి, రమ, రోజా, ధన్‌రాజ్‌, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 10:33 PM